CM Jagan: వరికి బదులు మిల్లెట్స్ సాగు.. రైతులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్..

CM Jagan: అందరికి అన్నం పెట్టే అన్నదాత అన్నం కోసం ఆకలితో ఎదురుచూడని రోజులు రావాలి.. అందుకు వ్యవసాయం దండగ కాదు.. పండగ అనేలా చేయాలి..

CM Jagan: వరికి బదులు మిల్లెట్స్ సాగు.. రైతులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్..
Ap Cm Agri Funds
Follow us

|

Updated on: Dec 06, 2021 | 5:08 PM

CM Jagan: అందరికి అన్నం పెట్టే అన్నదాత అన్నం కోసం ఆకలితో ఎదురుచూడని రోజులు రావాలి.. అందుకు వ్యవసాయం దండగ కాదు.. పండగ అనేలా చేయాలి.. దీనికి కావలసింది. రైతుకు డిమాండ్ అండ్ సప్లై పై పూర్తి అవగాహన… దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. రైతులకు వ్యవసాయ పంటలపై , సాగు పై అవగాహనా కలిగించేలా చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రగతిపై  అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై  అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అంతేకాదు సాగు చేసే రైతులకు తగిన తోడ్పాటు అందించాలన్నారు.

ముఖ్యంగా బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహనకల్పించాన్నారు. ఇలా ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలని తెలిపారు. ముఖ్యంగా రైతుకు వరి పండిస్తే… వచ్చే ఆదాయం మిల్లెట్స్‌ పండిస్తే కూడా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని తెలియపరు. ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలన్నారు జగన్. మిల్లెట్స్‌ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలని .. వెంటనే మిల్లెట్స్‌ బోర్డును  ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

మిల్లెట్స్ సాగు  

ఇప్పటికే మిల్లెట్స్‌ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా ఆర్బీకే యూనిట్‌గా ఆర్గానిక్‌ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున సీహెచ్‌సీలో కూడా ఆర్గానిక్‌ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలి. సేంద్రీయ వ్యవసాయినికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు సీఎం.

 ఇ–క్రాప్‌

ఆంధ్రప్రదేశ్ ఖరీఫ్ సీజన్ లో 45,35,102 మంది రైతులు 1.12 కోట్ల ఎకరాలను ఇ– క్రాప్‌ చేయించుకున్నారని .. ఇప్పటికే రబీలో ఇ– క్రాప్‌ ప్రారంభించామని  అధికారులు సీఎం జగన్ కు చెప్పారు. అయితే ఈ సందర్భంగా సీఎం జగన్ ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సర్టిఫికేషన్‌కూడా ఇచ్చేలా వ్యవస్థ రావాలన్నారు.

కల్తీపై కఠిన చర్యలు: 

రైతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం జగన్ హెచ్చరించారు. అలా రైతులకు కల్తీ సరుకులు ఇచ్చేవారికి రెండేళ్లు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని.. అందుకోసం చట్టంలో మార్పులు తీసుకొని వస్తామని చెప్పారు. తమ ప్రభుత్వానికి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలనే ఉద్దేశ్యమని చెప్పారు.

రాష్ట్రంలో క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు చేస్తామని.. వీటిని నీరేగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.  రైతులను ఇబ్బంది పెట్టె విధంగా ఉద్యోగులు ప్రవర్తిస్తే.. వారిని తొలగించడమే కాదు.. చట్టప్రకాశం శిక్షిస్తామని తెలిపారు. రైతులకు అన్యాయం చేసే విధంగా అక్రమాలకు పాల్పడే వ్యాపారులపైనా కఠిన చర్యలు ఉంటాయని తీవ్రంగా సీఎం హెచ్చరించారు. అంతేకాదు ఏపీలోని రైతుల నోటి నుంచి ఎక్కడా విత్తనాలు అందలేదనే రాకూడదని డిమాండ్‌ మేరకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

పాలవెల్లువ కార్యక్రమం

అంతేకాదు సీఎం జగన్ పాలవెల్లువ కార్యక్రమంపైనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబరులో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం చేయనున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ పాలవెల్లువ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా  1,77,364 మహిళలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. సగటున రోజువారీ పాలసేకరణ ద్వారా ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా  1కోటి 32లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Also Read:  ఏ బుల్లితెర నటికి దక్కని అభిమానం వంటలక్క సొంతం.. అనాథాశ్రమంలో దీప పుట్టిన రోజుని జరిపిన ఫ్యాన్స్..