Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఊపిరి.. సెయిల్‌లో విలీనం దిశగా అడుగులు..! అదే జరిగితే..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్​ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఊపిరి.. సెయిల్‌లో విలీనం దిశగా అడుగులు..! అదే జరిగితే..
Vizag Steel Plant
Follow us

|

Updated on: Sep 28, 2024 | 7:31 AM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్​ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థల చైర్మన్లు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అంశాలపై చర్చించారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూములను ఎన్‌ఎండీసీకి విక్రయించడం, బ్యాంకు రుణాలవంటి ప్రత్యామ్నాయ అంశాలు కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ని సెయిల్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ .. కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నాయని, NMDCకి స్టీల్ ప్లాంట్ భూములు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.

స్టీల్ ప్లాంట్ అంశంపై ఎస్‌బీఐతో కేంద్ర ఉన్నతాధికారుల భేటీ

ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించేందుకు స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కేంద్ర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్లాంట్‌కు మూలధన పెట్టుబడికోసం రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ కోసం NMDCకి రెండు వేల ఎకరాల భూమిని విక్రయించే యోచన కూడా ఉందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చేస్తోంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయంపై ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్టీల్ ప్లాంట్‌కి చెందిన 24.99 ఎకరాలను మాత్రమే యాజమాన్యం విక్రయించేందుకు అనుమతించిన హైకోర్టు మిగిలిన భూములపై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.

ప్రైవేటీకరణ నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు

నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పని చేస్తుండటమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం ఇప్పటికే అంచనాకు వచ్చింది. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని లాభాల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. ఈ దిశగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడారని.. కానీ ప్రతిపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అసత్య ప్రచారం చేస్తున్నాయని పురంధేశ్వరి అన్నారు.

సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్‌ విలీనం!

ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంత గనులు లేకపోవడమే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి. అందుకే సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. గతంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్రం.. కార్మికుల ఆందోళనలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన సెయిల్ లో విలీనం చేస్తే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే దిశగా కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ విలీనం..! అదే జరిగితే..
సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ విలీనం..! అదే జరిగితే..
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
సాయి పల్లవి ఈజ్ బ్యాక్.. అద్భుతమైన పాత్రతో న్యాచురల్ బ్యూటీ..
సాయి పల్లవి ఈజ్ బ్యాక్.. అద్భుతమైన పాత్రతో న్యాచురల్ బ్యూటీ..
వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు..
వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్..
మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!