Vizag: చేపలు బాగా పడ్డాయని వల విప్పిన జాలర్లు.. దాన్ని చూసి వెన్నులో వణుకు
సాధారణంగా దేనికీ పెద్దగా భయపడే తత్వం లేని మత్స్యకారులకు సైతం దాన్ని చూడగానే వణుకు పుట్టింది. సముద్రంలో విష సర్పాలు పెద్దగా ఉండవు. నీటిలో అవి మనుగడ సాగించలేవు. కానీ ఇది అరుదైన విష సర్పం. ఈ ఘటన జరిగింది విశాఖ నగర పరిధిలోని సాగర్ నగర్ వద్దే. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

అరుదైన విషసర్పం అది – చేపల వేటకు వెళ్ళి వచ్చి మంచి చేపలు పడి ఉంటాయన్న ఆశతో వల విప్పిన మత్స్యకారులకు ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే విధంగా ఈ పాము కనిపించింది. సాధారణంగా దేనికీ పెద్దగా భయపడే తత్వం లేని మత్స్యకారులకు సైతం దాన్ని చూడగానే వణుకు పుట్టింది. సముద్రంలో విష సర్పాలు పెద్దగా ఉండవు. నీటిలో అవి మనుగడ సాగించలేవు. కానీ ఇది అరుదైన విష సర్పం. ఈ ఘటన జరిగింది విశాఖ నగర పరిధిలోని సాగర్ నగర్ వద్దే. నిరంతరం పర్యాటకుల సందడితో ఉండే ప్రాంతమే అది. స్థానిక మత్స్య కారులు కూడా సముద్రంలో ఎక్కువ దూరం కూడా వేటకు వెళ్ళలేదు. తీరానికి 500 మీటర్ల లోపే చేసిన వేటలో చేపలతో పాటు ఈ సర్పం కూడా బయటకు వచ్చింది. సాధారణంగా ఇలా వలలో పాములు చిక్కడం సహజమైన విషయమే. కానీ విష సర్పాలు ఉండవు. నీటి సర్పాలు ఉంటుంటాయి, అవి ప్రమాద రహితం.
ఈ విషసర్పం సాంకేతిక నామం ‘హైడ్రో ఫిస్ సీ స్నేక్’
సముద్ర జలాల్లో సుదూరంగా సంచరించే ఈ జీవి టెక్నికల్ నేమ్ హైడ్రో ఫిస్ సీ స్నేక్. ఈ పాము అత్యంత విష పూరితం అని వివరించారు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి. శ్రీనివాసరావు. ఇది కరిస్తే బతకడం అసాధ్యమట. కరిసినప్పుడు నిమిషాల్లో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలు పోతాయట.
పామును మళ్లీ సముద్రంలోనే వదిలేసిన మత్స్యకారులు
సముద్ర అట్టడగు భాగాన చిన్న, చిన్న చేపలు, రాళ్లలోని నాచు తింటూ ఇవి మనుగడ సాగిస్తుంటాయి. ఫుడ్ కోసం వెతుకులాటలో ఒక్కోసారి చేపలలో కలిసి వలల్లో చిక్కుకుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఈ పామును కట్ల పాము అని కూడా పిలుస్తుంటారని మత్స్యకారులు వివరించారు. విష సర్పం అయినా చంపకుండా సుమారు ఏడడుగులున్న ఈ పామును మళ్లీ తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టి వారు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..