Viral: విశాఖ జూలో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి.. వీడియో వైరల్.
విశాఖపట్టణంలోని పర్యాటక ప్రాంతాల్లోఇందిరా గాంధీ జూ పార్క్ ఒకటి. ఎన్నో రకాల జంతువులతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జూ పార్క్ లో సోమవారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు పై ఎలుగుబంటి దాడి చేసింది. సోమవారం ఉదయం జూ పార్క్ లో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ పరిసరాల్లో నగేష్ క్లీన్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది.
విశాఖపట్టణంలోని పర్యాటక ప్రాంతాల్లోఇందిరా గాంధీ జూ పార్క్ ఒకటి. ఎన్నో రకాల జంతువులతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జూ పార్క్ లో సోమవారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు పై ఎలుగుబంటి దాడి చేసింది. సోమవారం ఉదయం జూ పార్క్ లో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ పరిసరాల్లో నగేష్ క్లీన్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. వాస్తవంగా ఎన్ క్లోజర్ శుభ్రం చేసే సమయంలో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ గేట్ మూసి వేసి ఉండాలి. అయితే ఆ గేట్ ఓపెన్ అయ్యి ఉండడం తో బయటకు వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా నగేష్ పై దాడికి పాల్పడింది. నగేష్ పై ఎలుగుబంటి దాడి చేస్తున్న సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో సందర్శకులు కూడా ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడి పై దాడి చేయడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన జూ అధికారులు ఎలుగుబంటిని బంధించారు. తీవ్ర గాయాల పాలైన నగేష్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్లీనింగ్ చేసే సమయంలో ఎలుగుబంటిని ఎన్‌క్లోజర్‌లో వేసి గేటు లాక్ చేయడం మర్చిపోయాడని, దాంతో ఎలుగుబంటి బయటకు వచ్చి అతనిపై దాడి చేసినట్లు జూ అధికారులు తెలిపారు. మృతుని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

