‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?
ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీసులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. అధికారులతో సమీక్షలు నిర్వహించే మీటింగ్ హాల్‌లో సీఎం కూర్చునే స్థానం వెనుక భాగంలో ఉండే బౌద్ధ ధర్మచక్ర స్థానంలో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని..

ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీసులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. అధికారులతో సమీక్షలు నిర్వహించే మీటింగ్ హాల్‌లో సీఎం కూర్చునే స్థానం వెనుక భాగంలో ఉండే బౌద్ధ ధర్మచక్ర స్థానంలో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సీఎంవో. చక్రం వెనుక భాగంలో ఉండటం వల్ల అనవసర సమస్యలు ఉంటాయనే కారణంతోనే.. తీసేశారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. కాగా ఏపీ సీఎంవో మంగళవారం షేర్ చేసిన ఫొటోల్లో జగన్ బ్యాక్ గ్రౌండ్‌లో చక్రం ఉండగా.. బుధవారం నాటి సమీక్షలో షేర్ చేసిన ఫొటోల్లో మాత్రం అది కనిపించలేదు.
కాగా.. ఏపీ రాజధాని అమరావతికి చిహ్నంగా మాజీ సీఎం చంద్రబాబు ఆ బౌద్ధ ధర్మచక్రాన్ని ఎంతో ఇష్టపడి ఏర్పాటు చేయించారు. ఇన్నాళ్లపాటు అది అలాగే ఉన్నా.. సడన్‌గా ఎందుకు మార్చేశారా? అని టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ శ్రేణులు మాత్రం.. జగన్ మంచి పని చేశారని కితాబిస్తున్నారు.
కోవిడ్ నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన 32 వేల మందికి కూడా పరీక్షలు చేయాలని, క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లే పేద బాధితులకు రూ.2వేలు ఆర్థిక సాయం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. pic.twitter.com/0N9v0Oitb8
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 15, 2020
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ నివారణా చర్యలు, రైతులను ఆదుకునే చర్యలు, రేషన్ పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు. pic.twitter.com/rD1j9qWDJ9
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 14, 2020