తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్‌డేట్స్…
దేశంలో కరోనా డేంజర్‌బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు...ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా

దేశంలో కరోనా డేంజర్‌బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు. మహారాష్ట్రలో 18 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఆరుగురు, గుజరాత్‌లో నలుగురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు, తమిళనాడులో ఒకరు, పంజాబ్‌లో ఒకరు, మేఘాలయాలో ఒకరు మృతిచెందారు. కొత్తగా 1,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిని పరిశీలించగా..
ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రంనుంచి బుధవారం రాత్రి 7 గంటల వరకు కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. బుధవారం కొత్తగా కర్నూలు జిల్లాలో 19 కేసులు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 8 కేసుల చొప్పున, కడప జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 2, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కాగా, నలుగురు కోలుకుని డిశ్చార్చి అయ్యారు. వైరస్ కారణంగా ఐదుగురు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 14కు చేరగా, కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 20కి చేరింది.