గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారి నుంచి 5 లక్షల మంది కోలుకున్నారు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారి నుంచి 505,282 బాధితులు కోలుకున్నారు. ప్రపంచదేశాలన్నింటికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2,044,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 131,340 మంది మృతి చెందగా.. 505,282 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. అత్యధికంగా ఆ దేశంలో 622,380 కేసులు నమోదు […]

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారి నుంచి 505,282 బాధితులు కోలుకున్నారు. ప్రపంచదేశాలన్నింటికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2,044,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 131,340 మంది మృతి చెందగా.. 505,282 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు.
మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. అత్యధికంగా ఆ దేశంలో 622,380 కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 27,548కి చేరింది. అటు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక చైనాలో మళ్లీ కొత్త కేసులు రావడం ఇబ్బందికర పరిణామం. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 11933 కేసులు నమోదు కాగా.. 392 మృతి చెందారు.
కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…
- అమెరికా – 622,380 కేసులు, 27,548 మరణాలు
- స్పెయిన్ – 177,633 కేసులు, 18,579 మరణాలు
- ఇటలీ – 165,155 కేసులు, 21,645 మరణాలు
- ఫ్రాన్స్ – 143,303 కేసులు, 15,729 మరణాలు
- జర్మనీ – 133,154 కేసులు, 3,592 మరణాలు
- బ్రిటన్ – 98,476 కేసులు, 12,868 మరణాలు
- చైనా – 82,295 కేసులు, 3,342 మరణాలు
- ఇరాన్ -76,389 కేసులు, 4,777 మరణాలు
- టర్కీ – 69,392 కేసులు, 1,518 మరణాలు
- బెల్జియం – 33,573 కేసులు, 4,440 మరణాలు
- నెదర్లాండ్స్ – 28,153 కేసులు, 3,134 మరణాలు
- కెనడా – 27,593 కేసులు, 954 మరణాలు
- స్విట్జర్లాండ్ – 26,336 కేసులు, 1,239 మరణాలు
- ఇండియా – 11933 కేసులు, 392 మరణాలు
