అన్నవరంలో కరోనా కలకలం.. 14వరకు ఆలయం మూసివేత
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో కరోనా కలకలం రేపింది. దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బందికి కరోనా సోకింది
Corona Cases at Annavaram temple: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో కరోనా కలకలం రేపింది. దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బందికి కరోనా సోకింది. శుక్రవారం వరకు పది మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకగా.. ఇవాళ 300 మంది సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో మరో 29 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాగా ఆలయాల్లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో అర్చకులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.
Read This Story Also: రూ.13 లక్షలు క్లియర్ చేసి మృతదేహాన్ని తీసుకెళ్లండి