Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అనకాపల్లిలో యానాం కిక్కు… ఆ మత్తు వదిలిందిలా..!

లిక్కర్ మాఫియా కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొంతమంది ఒరిస్సా మద్యాన్ని ఏపీలోకి దిగుమతి చేసేస్తుంటే... మరి కొంతమంది యానం లిక్కర్ను రుచి చూపించేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా సీసాలకు సీసాలు తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. డబుల్ రేట్ తో సేల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పాపం ఊరికే పోతుందా..?!

AP News: అనకాపల్లిలో యానాం కిక్కు... ఆ మత్తు వదిలిందిలా..!
Illegal Liquor
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 26, 2023 | 9:55 AM

జులై 26: అనకాపల్లి జిల్లా యస్.రాయవరంకు చెందిన దొర బాబు, కత్తిపూడికి చెందిన వీరబాబు మిత్రులయ్యారు. అంతకుముందు ఇద్దరూ వేరువేరుగా మద్యం షాపుల్లో పనిచేసేవారు. అయితే ఓ కేసులో పాయకరావుపేట పోలీసులు వీరబాబును పట్టుకున్నారు. అదే పోలీస్ స్టేషన్‌కు దొరబాబు కూడా వెళ్ళాడు. అప్పటి నుంచి మొదలైంది వాళ్ళ పరిచయం. ఇంకేముంది.. నేను సరుకు తెస్తా నువ్వు సేల్ చెయ్ అంటూ.. ప్లాన్ చేసుకున్నారు ఇద్దరూ. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నుంచి చౌకగా వచ్చే మధ్యాన్ని తీసుకువచ్చి జనాలకు మత్తెక్కిస్తున్నారు.

ఆ గుట్టు బయటపడింది ఇలా..

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలోని వెంకటేశ్వరస్వామి గుడికి సమీపంలో షెడ్‌లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారని సమాచారం తో దాడులు చేశారు పోలీసులు. పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించారు. యానాంకు చెందిన 14 కేసులు అంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 864 రెడ్ రోజ్ క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

అక్కడ 60.. ఇక్కడ 120..

అయితే వీరిలో కత్తిపూడికి చెందిన వీరబాబుపై గతంలో ఇదే విధమైన మద్యం కేసు కూడా ఉంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దొరబాబుతో అక్కడ ఏర్పడింది. యానాంలో ఒక్కొక్క క్వాటర్ బాటిల్‌ను 60 రూపాయలు కొనుగోలు చేసిన వీరబాబు.. వాటిని దొరబాబుకు సప్లై చేసేస్తున్నాడు. దొరబాబు.. ఆ మందును ఎస్ రాయవరం పరిసర ప్రాంతాల్లోని వాటిని డబుల్ రేట్ కు పెట్టి అమ్మేస్తున్నాడు. అంటే ఒక్కో హోటల్ 60 నుంచి 120 కు సేల్ చేస్తున్నాడు. ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు నక్కపల్లి సర్కెల్ ఇన్స్పెక్టర్ అప్పన్న.

మందుబాబులకు యానం మద్యం మత్తును ఎక్కించి.. వాళ్లు రెండు చేతుల సంపాదించడమే కాదు.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పెడుతున్నారు. ఎందుకంటే ఎటువంటి సుంకాలు లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేస్తూ అమ్మేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌..ప్రభుత్వం నుంచి ఓలా-ఉబర్‌ లాంటి ట్యాక్సీ సర్వీసులు
గుడ్‌న్యూస్‌..ప్రభుత్వం నుంచి ఓలా-ఉబర్‌ లాంటి ట్యాక్సీ సర్వీసులు
శివంగిలా రకుల్, సామ్, రష్మిక.. దృఢమైన సంకల్పం తమ ఆయుధం అంటూ..
శివంగిలా రకుల్, సామ్, రష్మిక.. దృఢమైన సంకల్పం తమ ఆయుధం అంటూ..
దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో..
దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో..
దేశంలోనే అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌.. ఆమె ఆస్తులు
దేశంలోనే అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌.. ఆమె ఆస్తులు
శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ కోటి చెల్లిస్తే.. కోటి సదుపాయాలు..
శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ కోటి చెల్లిస్తే.. కోటి సదుపాయాలు..
ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
గుడ్‌న్యూస్‌..ఈ కారుపై రూ. 65,000 తగ్గింపు, ఉచితంంగా బంగారు నాణెం
గుడ్‌న్యూస్‌..ఈ కారుపై రూ. 65,000 తగ్గింపు, ఉచితంంగా బంగారు నాణెం
సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి.
సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి.
బాబర్ అజామ్ సింగల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్!
బాబర్ అజామ్ సింగల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్!
అన్నదాతకు ఎంత కష్టం.. కిడ్నీ రూ.75వేలు..! అవయవాలను అమ్మకానికి
అన్నదాతకు ఎంత కష్టం.. కిడ్నీ రూ.75వేలు..! అవయవాలను అమ్మకానికి