AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బాప్ ఏక్ నెంబర్.. బేటా సౌ నెంబర్.. పోలీసులకే ముచ్చెమటలు పట్టించారు కదరా..!

Visakhapatnam News: వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు..! కానీ ఇద్దరికీ ఇద్దరే సాటి.. ఎందుకంటే బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్.. కాదు కాదు సౌ నెంబర్ అనాల్సిందే..! సన్మార్గాల వైపు నడిపించాల్సిన కొడుకును నేరాల వైపు మళ్ళించాడు ఆ తండ్రి. యూట్యూబ్‌లో చూసి తాను అలవర్చుకున్న టెక్నిక్ ను కొడుకుకి నేర్పించాడు. అంతేకాదండోయ్..

Andhra Pradesh: బాప్ ఏక్ నెంబర్.. బేటా సౌ నెంబర్.. పోలీసులకే ముచ్చెమటలు పట్టించారు కదరా..!
Chain Snatchers
Maqdood Husain Khaja
| Edited By: Shiva Prajapati|

Updated on: Oct 06, 2023 | 10:11 AM

Share

Visakhapatnam, October 06: వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు..! కానీ ఇద్దరికీ ఇద్దరే సాటి.. ఎందుకంటే బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్.. కాదు కాదు సౌ నెంబర్ అనాల్సిందే..! సన్మార్గాల వైపు నడిపించాల్సిన కొడుకును నేరాల వైపు మళ్ళించాడు ఆ తండ్రి. యూట్యూబ్‌లో చూసి తాను అలవర్చుకున్న టెక్నిక్ ను కొడుకుకి నేర్పించాడు. అంతేకాదండోయ్.. ఒంటిపై దుస్తులు మార్చినంత ఈజీగా.. వాహనాలకు నెంబర్ ప్లేట్స్ మార్చేసి రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. వీరిద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు ఏకంగా 350 కి పైగా సీసీ కెమెరాలు పరిశీలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ పరిస్థితిని బట్టి వాళ్ల వ్యవహారం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తండ్రి కొడుకుల చైన్ స్నాచింగ్ కథను ఓసారి చదివేద్దాం..

వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు..! రెండవ తండ్రి అయినప్పటికీ స్నేహితుల్లా కలిసి ఉంటారు. దోస్త్ మేరా దోస్త్ అనేలా ఇద్దరూ షికార్లు చేస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా తుని లోని రామాలయం వద్ద తల్లితోపాటు నివాసం ఉంటున్నాడు మొగలి సూర్య అనే యువకుడు. తండ్రి చనిపోవడంతో వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది తల్లి. జీవితం అలా సాగిపోతుంది. తునిలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. సొంత ఇంటి కలలో నెరవేర్చుకోవాలని అనుకున్నారు. కానీ చేతిలో ఇల్లు కట్టేంత డబ్బులు లేవు. ఎలాగైనా ఆ కల నెరవేర్చుకోవాలని అనుకున్న వెంకటేశ్వరరావు.. డబ్బును సంపాదించాలనుకున్నాడు. తండ్రి, కొడుకులు ఇద్దరూ కూర్చుని ప్లాన్ వేశారు.

యూట్యూబ్‌లో చూసి వరుస స్నాచింగ్స్ చేసి..

చైన్ స్నాచింగ్‌లు చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నాడు వెంకటేశ్వరరావు. అనుభవం లేకపోవడంతో యూట్యూబ్‌లో బ్రౌజ్ చేశాడు. చైన్ స్నాచింగ్ లు చేయడం ఎలా..? చేసిన తర్వాత పారిపోవడం ఎలా..? ఏం చేస్తే తప్పించుకొని దర్జాగా తిరగవచ్చు..? అన్న కాన్సెప్ట్ లో వీడియోలు చూశాడు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత రంగంలోకి దిగిపోయాడు. తుని నుంచి విశాఖ సిటీకి వచ్చి లాసెన్సీ కాలనీలో వెంకటేశ్వరరావు ఒక్కడే ప్రయత్నం చేశాడు. ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. అది కాస్త విజయవంతం కావడంతో సవతి కొడుకు సూర్యకు చెప్పాడు. ఇద్దరూ కలిసి మళ్లీ విశాఖ సిటీకి వచ్చేసారు. గత నెల 6న ఎంవిపి కాలనీలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. 24న మురళి నగర్‌లో ఒంటరిగా నడిచే మహిళను టార్గెట్ చేసి గొలుసు లాక్కెళ్లారు. ఇలా నాలుగు నేరాల్లో 18 త్తులాల బంగారాన్ని ఎత్తుకుపోయారు.

ఇవి కూడా చదవండి

నెంబర్ ప్లేట్లు మార్చి.. తండ్రి బైక్ రైడింగ్ కొడుకు స్నాచింగ్స్..

తండ్రి బైక్‌ను రైడ్ చేయడం.. కొడుకు గొలుసులు లాగడం.. ఇదే పనిగా పెట్టుకుని నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేరాల కోసం మరో ఐడియా కూడా వేశారు. చోరీ కోసం ఇంటి నుంచి బయలుదేరి ఓ వాహనంలో.. విశాఖ సిటీలో ఎంటర్ అయ్యే సమయంలో నెంబర్ ప్లేట్లు మార్చేసేవారు. డూప్లికేట్ నెంబర్ ప్లేట్ ను బైక్ కు తగిలించి చైన్ స్నాచింగ్ చేసి తిరిగి వెళ్ళిన సమయంలో.. మళ్లీ యధాతధంగా ఒరిజినల్ నెంబర్ ప్లేట్ ను బైక్‌కు అతికించేసేవారు. ఒకసారి వినియోగించిన బైకును మళ్ళీ మళ్ళీ వాడేవారు కాదని అంటున్నారు క్రైమ్ డిసిపి నాగన్న. స్నేహితుల నుంచి తీసుకున్న బైక్ లను తీసుకువచ్చి నేరాలు చేసి వెళ్ళిపోయేవారని చెప్పారు.

350 కి పైగా సీసీ కెమెరాలు చెక్ చేసి..

వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో మురళి నగర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ ఆధారంగా పోలీసులు శ్రమించారు. ఎనిమిది బృందాలుగా ఏర్పడి దొంగల కోసం వెతకడం ప్రారంభించారు. ఘటన స్థలాల నుంచి తుని వరకు దాదాపుగా 350 కి పైగా సీసీ కెమెరాలు పరిశీలించారు. ఎట్ట గెలకు కొడుకు సూర్య పోలీసులు పట్టుకున్నారు. బంగారాన్ని రికవరీ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. తండ్రి వెంకటేశ్వరరావు పరారీ లోనే ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని అన్నారు క్రైమ్ డిసిపి నాగన్న క్రైమ్.

ఇదీ.. తుని టు వైజాగ్.. ఈ తండ్రీ కొడుకుల చైనీస్ మ్యాచింగ్‌ల వ్యవహారం. ఎట్టకేలకు వరుస చైనీస్ మ్యాచింగ్ లకు పాల్పడే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తండ్రీ కొడుకులని తెలిసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..