దీపావళికి స్వీట్స్ కొంటున్నారా..! అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఈ వార్త చూసేయండి..
Vizag News: దీపావళికి మీరు స్వీట్ షాప్‌కి వెళ్తున్నారా.? పండుగ రోజున తియ్యని మిఠాయి తింటూ.. క్రాకర్స్ కాల్చుకోవాలని అనుకుంటున్నారా.? ఘుమఘుమలాడే కమ్మని నోరూరించే స్వీట్స్ తీసుకువచ్చి ఫ్యామిలీతో సంబరాలు జరుపుకోవాలనుకుంటున్నారా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ వార్త చదివారంటే ఠక్కున మీ ఛాయస్ మార్చుకుంటారు. ఓసారి చదివేయండి మరి..

దీపావళికి మీరు స్వీట్ షాప్‌కి వెళ్తున్నారా.? పండుగ రోజున తియ్యని మిఠాయి తింటూ.. క్రాకర్స్ కాల్చుకోవాలని అనుకుంటున్నారా.? ఘుమఘుమలాడే కమ్మని నోరూరించే స్వీట్స్ తీసుకువచ్చి ఫ్యామిలీతో సంబరాలు జరుపుకోవాలనుకుంటున్నారా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు కొనే స్వీట్స్ ఎంతవరకు సేఫ్..! అవి నాణ్యమైనవేనా..? ఇప్పుడు ఇదే తేల్చే పనిలోపడ్డారు విశాఖలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు. నగరంలోని ప్రముఖ స్వీట్ షాపులపై మెరుపు దాడులు చేస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పండగ ఏదైనా సెలబ్రేషన్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది మిఠాయిలు. నోరూరించే మిఠాయిలు తీసుకొచ్చి పండుగను సెలబ్రేషన్ చేసుకోవడం సాంప్రదాయంగా భావిస్తాం. గ్రామాల్లో అయితే ఇళ్లలోనే వంటకాలు చేసుకుంటారు.. కానీ సిటీస్‌లో ఉండే బిజీ లైఫ్ వల్ల చాలామంది రెడీమేడ్ స్వీట్స్ వైపే మొగ్గు చూపుతుంటారు. వాటినే ఆసరాగా చేసుకుని కొంతమంది స్వీట్ షాపు ఓనర్లు నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం నియమ నిబంధనలు ఉన్నప్పటికీ.. లెక్కకు మిక్కిలిగానే అవి పాటిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఆ స్వీట్స్‌లో..
దీపావళి నేపథ్యంలో రకరకాల మిఠాయిలు రెడీ చేసి అందుబాటులోకి తెచ్చాయి స్వీట్ షాపులు. స్వీట్స్ తయారు చేయడంపై ఎంత జాగ్రత్తలు పాటించాలో.. వాటిని నిల్వ చేయడంలో కూడా అంతే దృష్టి సారించాల్సి ఉంటుంది. కానీ విశాఖలోని చాలావరకు స్వీట్ షాపులు.. అవేవీ పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. స్వీట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. ఏఎఫ్‌సీ నందాజీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు నేతృత్వంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈగలు, దోమల నియంత్రణకు కొన్ని స్వీట్ షాపులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని అంటున్నారు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ.
కనీస జాగ్రత్తలు వట్టి మాటే..!
దీపావళి నేపథ్యంలో నాసిరకం, నాణ్యత లేని మిఠాయిలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు.. వాటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. కొన్ని చోట్ల తయారు చేసిన మిఠాయిల్లో ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగించినట్టు అనుమానిస్తున్నారు. దీంతో పాటు స్వీట్స్ డిస్‌ప్లే పెట్టిన చోట ఈగలతో అన్-హైజినిక్ కండిషన్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్.. ఎక్స్‌పైరీ డేట్ కూడా డిస్‌ప్లేగా ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు. కానీ ఎక్కడా అలాంటి జాగ్రత్తలు పాటించినట్టు కనిపించడం లేదని చెప్పుకొచ్చారాయన.
శాంపిల్స్ సేకరించిన అధికారులు..
స్వీట్ షాపుల్లో అనుమానస్పదంగా ఉన్న మిఠాయిల శాంపిల్స్ సేకరించిన అధికారులు.. వాటిని ల్యాబ్‌కు పంపిస్తున్నారు. పరీక్షల్లో నాసిరకం, నాణ్యతా ప్రమాణాలు పాటించనట్టు తేలితే చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ఇప్పటికే గతంలో కొన్ని స్వీట్స్ షాప్‌లపై కేసులు కూడా పెట్టారు. భారీ జరిమానాలు కూడా విధించారు. దీంతో ఈ దీపావళి పూట స్వీట్ షాపులకు వెళ్లే కస్టమర్లు.. హైజినిక్ కండిషన్‌లో ఉన్న స్వీట్లు మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. బీ అలర్ట్.!




