World AIDS Day: కలెక్టర్ ఔదార్యం.. హెచ్ఐవి బాధితుల సంక్షేమానికి నెల జీతం విరాళం..
జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే సొసైటీలో.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటామన్నారు. విరాళాలు, సిఎస్ఆర్ నిధులు సేకరించి.. హెచ్ఐవి బాధితుల సంక్షేమం ఆరోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్టు చెప్పారు కలెక్టర్ మల్లికార్జున్.

విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ ఔదార్యం చూపించారు. హెచ్ఐవి బాధితుల సంక్షేమానికి నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు జిల్లా కలెక్టర్. అంతేకాదు హెచ్ఐవి బాధితులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. బాధితులతో తో కలిసి ముచ్చటించి వారికి భరోసా కల్పించి, మనోధైర్యాన్ని నింపారు కలెక్టర్ మల్లికార్జున. జిల్లా వ్యాప్తంగా 2900 మంది హెచ్ఐవి తో బాధపడుతున్నారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా సమానత్వం అనే థీమ్ తో.. ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై.. బాధితుల కు భరోసా కల్పించారు. హెచ్ఐవి బాధితుల సంక్షేమానికి.. సొసైటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు కలెక్టర్. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే సొసైటీలో.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటామన్నారు. విరాళాలు, సిఎస్ఆర్ నిధులు సేకరించి.. హెచ్ఐవి బాధితుల సంక్షేమం ఆరోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్టు చెప్పారు కలెక్టర్ మల్లికార్జున్.
అసమానతలను అంతం చేయడానికి అందరూ ఏకమవ్వాలని, ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులతో కలసి అల్పాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిడ్స్ సోకిన వారిని అందరితో సమానంగా చూడాలని, కొత్తగా ఏ ఒక్కరూ కూడా హెచ్ ఐ వి భారిన పడకుండా అవగాహన కలిగించాలన్నారు. ఇప్పటికే ఎయిడ్స్ సోకిన వారిని ఎటువంటి వివక్షత చూపకుండా సామూహికంగా కలుపుకొని పోవాలని ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్చంద సేవా సంస్థలు కృషి చేయాలన్నారు. అదే విదంగా రక్తపరీక్షలు చేసేటప్పుడు, రక్తమార్పిడి చేసే సమయంలో వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకొని ఎయిడ్స్ వ్యాప్తి కాకుండా చూడాలని కోరారు డా.మల్లికార్జున్.
ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి తన వంతు విరాళంగా ఒక నెల జీతాన్ని లక్షా పది వేల రూపాయల ను చెక్కు రూపేణా డి.ఎల్.ఓ డా.పూర్నేంద్రబాబు కు అందజేసారు.




Reporter: Khaja
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
