Chandrababu: 7 మండలాలు ఏపీకి ఇవ్వడానికి కారణం నేనే.. అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ

పోలవరంలోనే ఏడు మండలాలను కలిపితేనే తాను సీఎంగా ప్రమాణం చేస్తానని చెప్పడంతో ఆనాడు ఎన్డీఏ సర్కార్ ఏడు మండలాలను ఏపీలో కలిపిందన్నారు.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ ఆర్ &ఆర్ ప్యాకేజీ కింద న్యాయం చేసే బాధ్యత తనదని బాధితులకు హామీ ఇచ్చారు

Chandrababu: 7 మండలాలు ఏపీకి ఇవ్వడానికి కారణం నేనే.. అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ
Chandra Babu
Follow us

|

Updated on: Dec 01, 2022 | 8:30 PM

పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును జగన్ రెడ్డి నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరంలో పర్యటించారు ..ఈ సందర్భంలో ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిని పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఏ కారణంతో పోలీసులు తనను అడ్డుకున్నారో చెప్పాలన్నారు. పోలవరంలోనే ఏడు మండలాలను కలిపితేనే తాను సీఎంగా ప్రమాణం చేస్తానని చెప్పడంతో ఆనాడు ఎన్డీఏ సర్కార్ ఏడు మండలాలను ఏపీలో కలిపిందన్నారు.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ ఆర్ &ఆర్ ప్యాకేజీ కింద న్యాయం చేసే బాధ్యత తనదని బాధితులకు హామీ ఇచ్చారు

ఉదయం నరసన్నపాలెంలో బీసీ నేతలతో సమావేశమైన చంద్రబాబునాయుడు జగన్.. బీసీలకు మాయమాటలు చెప్పి అణగదొక్కేశాడని ఆరోపించారు. ‘‘బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత తగ్గించారన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మంచి గుర్తింపు వస్తుందని అందుకే ఆదరణ పథకం మీ కోసం అప్పుడు అమలు చేశానన్నారు 34, 400 కోట్లు బీసీల కోసం సబ్ ప్లాన్ అమలు చేశానని 50 శాతం జనాభా ఉన్న బీసీల కోసం జగన్ ఒక్క రూపాయి కూడా అందరి కన్నా ఎక్కువ ఖర్చు చేశాడా అనొ ప్రశ్నించారు 140 బీసీ కులాల కోసం ఎంత ఖర్చు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో 37 మంది మెంబర్స్ ఉంటే.. బీసీలకు ముష్టి మూడు పదవులు ఇచ్చాడు. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా అన్నారు సీఎం, డీజీపీ, సీఎస్, సకల శాఖామంత్రి, సాక్షి గుమస్తా అంతా ఆయన జిల్లాకు చెందినవారే. సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల వీరేనా రాజకీయం చేసేది..? మీరు చేయలేరా? యూనివర్శిటీల్లో వీసీలనే కాదు, రిజిస్ట్రార్లను వాళ్ళ వారినే వేసుకున్నారు. ఇతర కులాల వీసీలను తొలగించి వాళ్ళకు నచ్చిన వారిని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చి.. ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు. జగన్ మీటింగ్‌కు రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మీటింగులకు వచ్చిన ఆడపిల్లల చున్నీలను లాగేసారు. పెళ్లి కానుక లేదు, అన్న క్యాంటీన్ లేదు.. అన్ని పోయాయన్నారు ఆయనకు బటన్ నొక్కడం మాత్రమే వచ్చు. మీ పొట్టలు కొట్టి, జగన్ తన పొట్ట పెంచుకుంటున్నాడు.’’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

మరోవైపు చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తుంటే కొయ్యలగూడెం వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు లతాలు ప్రదర్శిస్తూ ప్రతిపక్ష నేతగా ఉండటం మా కర్మ అంటూ నిరసనకు దిగారు ఈ సందర్భంలో కొంతమర ఉధృత పరిస్థితులు నెలకొన్న పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమనింది కొయ్యలగూడెం మీదగా గోపాలపురం నియోజకవర్గంలోకి ఆ తర్వాత పోలవరం చేరుకున్న చంద్రబాబు రాత్రికి కొవ్వూరు నియోజకవర్గం చేరుకున్నారు అక్కడే బస్సు చేసి రేపు కొవ్వూరు నుండి నిడదవోలు తాడేపల్లి గూడెం నియోజకవర్గాలలో పర్యటించమన్నారు

ఇవి కూడా చదవండి

Report: Ravi, Tv9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..