Vizag: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. మరికొన్ని గంటల్లో ముగియనున్న నామినేషన్ల గడవు..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. పూర్తిస్థాయి బలం ఉన్నా.. గ్రేటర్ విశాఖ స్థాయీ సంఘం ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడో అనుమానం తడుతోంది వైసీపీకి. అందుకే ముందస్తుగా.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరు, ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ క్యాంపు రాజకీయాలను..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. పూర్తిస్థాయి బలం ఉన్నా.. గ్రేటర్ విశాఖ స్థాయీ సంఘం ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడో అనుమానం తడుతోంది వైసీపీకి. అందుకే ముందస్తుగా.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరు, ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ క్యాంపు రాజకీయాలను బొత్స ఒప్పుకున్నారు. దుష్టులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సభ్యులను క్యాంపులకు పంపించామని చెప్పారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ ఆఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి.
ఇవాళ్టితో నామినేషన్ గడువు ముగుస్తుండడం, ఒకరోజు ముందుగానే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి బొత్స. నామినేషన్ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు. 500కు పైగా ఓట్లు ఉన్న YCPపై టీడీపీ పోటీలో ఉంటుందని అనుకోవడం లేదన్నారు మంత్రి బొత్స. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్యే అవుతుందన్నారు బొత్స. మరోవైపు నామినేషన్ గుడువు నేటితో మూగియనుండడంతో టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బైరా దిలీప్ పేరు దాదాపుగా ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై పార్టీ నేతల అభిప్రాయాలతో హైకమాండ్‌కి ఇప్పటికే రిపోర్ట్ పంపించారు. బైరా దిలీప్ విషయానికి వస్తే… ఆయన చిరంజీవి ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండడం.. అందులోనూ ఆర్థికంగా స్థితిమంతుడు కావడం కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా దిలీప్‌కి గంటా శ్రీనివాస్ అండదండలు ఉన్నాయనే ప్రచారం ఉంది. వీటికి తోడు ఉత్తరాంధ్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూటమి నేతలేనని.. పైగా ప్రభుత్వం కూడా చేతిలో ఉన్నందున.. క్యాంపులకు వెళ్లిన వాళ్లు కూడా కూటమికే వేస్తారని అంటున్నారు. ఫైనల్‌గా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వచ్చే రిపోర్టులను బట్టి బరిలో నిలవాలా? లేక లైట్ తీసుకోవాలా? అనేదానిపై టీడీపీ అధిష్టానం మరికాసేపట్లో ఓ నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..