Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని పలు జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర.. డ్రోన్ టెక్నాలజీ, కేంద్ర పధకాలపై అవగాహన..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన కార్యక్రమం 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర'. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.

ఏపీలోని పలు జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర.. డ్రోన్ టెక్నాలజీ, కేంద్ర పధకాలపై అవగాహన..
Narendra Modi Vikisit Bharat Sankalp Yatra
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 05, 2023 | 1:49 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన కార్యక్రమం ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే వీటిపై గ్రామీణ స్థాయిలో చాలామందికి అవగాహన లేకపోవడం.. అలాగే ఆయా గ్రామాల్లో ఉన్న లబ్దిదారులకు లబ్ది చేకూరకపోవడం లాంటివి కేంద్రం దృష్టికి వచ్చాయి. దీంతో కేంద్రం అందరికీ అన్నీ పధకాల లబ్ది చేకూరేలా.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరించనున్నారు. ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోనున్నారు.

ఈ ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతోంది. ఇందులో భాగంగా కర్నూలు, ఏలూరు జిల్లాల్లో వికసిత్ భారత్‌ సంకల్ప యాత్రను నిర్వహించారు. సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలు, రైతులు, మహిళలకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర పథకాల వివరాలను తెలియజేశారు. గ్రామ పంచాయితీల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు పరిచయం చేసేందుకు ఈ ప్రచారం దోహదపడుతుందన్నారు. సోమవారం ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు మండల బీజేపీ నేతలు అవగాహన కల్పించారు. ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాకుండా.. ఉచితంగా గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్లను లబ్దిదారులకు అందజేశారు.

అటు నంద్యాల జిల్లాలోని గడివేముల మండలంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో మండల స్థాయి, స్థానిక బీజేపీ నేతలు ప్రజలతో కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలతో గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రైతులకు డ్రోన్ సాయంతో వ్యవసాయం ఎలా చేయొచ్చునన్నది.. డ్రోన్ టెక్నాలజీ లాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడమే కాకుండా.. దగ్గర నుంచి డ్రోన్‌తో ఎరువులు చల్లి చూపించారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్ వంటి పథకాలను ప్రజలకు వివరించారు. సోయిల్ హెల్త్ కార్డు స్కీం, మాతృ వందన స్కీం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం లాంటి కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించారు.

వీడియో 1

వీడియో 2