Andhra: విశాఖ, విజయవాడలలో మెట్రో ట్రైన్స్ ఎప్పటినుంచో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ నగరాల అభివృద్ధిలో మరో కీలక మలుపు తిరిగింది. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 25న టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా... మెట్రో నిర్మాణానికి రూ.21,616 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యం 50:50గా ఉండనుంది.

ఆంధ్రాలో భవిష్యత్ పట్టణాల అభివృద్ధికి మరో కీలక మైలురాయి పడింది. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం జూలై 25, శుక్రవారం అధికారికంగా టెండర్లు పిలవనున్నారు. మెట్రో ప్రాజెక్టుల కోసం రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.21,616 కోట్లతో ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు నిర్మాణానికి నోడిచెప్పింది.
విజయవాడ మెట్రో: రూ.10,118 కోట్లు
విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం రూ.10,118 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఈ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన నిధులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున CRDA నుంచి రూ.3,497 కోట్లు విడుదలకు ఆమోదం లభించింది.
వైజాగ్ మెట్రో: రూ.11,498 కోట్లు
విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు కోసం రూ.11,498 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఇందులో రాష్ట్ర వాటా కింద VMRDA నుంచి రూ.4,101 కోట్లు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్, మహారాణిపేట, శీలానగర్ వరకూ మెట్రో విస్తరించనుంది.
కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యం 50:50
ఈ రెండు మెట్రో ప్రాజెక్టులూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 వాటా భాగస్వామ్యంతో అమలవుతాయి. కేంద్ర నగరాభివృద్ధి మిషన్ కింద ముందుగానే ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులకు ఇప్పుడు కార్యరూపం ఏర్పడనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




