AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రైతుగా వచ్చిన సబ్ కలెక్టర్.. ఎరువుల షాపు యజమానులకు చుక్కలు చూపించారు..

Andhra Pradesh: ఆయనో పబ్లిక్ సర్వెంట్. జిల్లా పాలనా యంత్రాంగానికి బాస్ తరువాత బాస్. మరి అక్రమార్కుల చెరలో చిక్కి పబ్లిక్ ఇబ్బందులు పడుతుంటే..

Andhra Pradesh: రైతుగా వచ్చిన సబ్ కలెక్టర్.. ఎరువుల షాపు యజమానులకు చుక్కలు చూపించారు..
Sub Collector
Shiva Prajapati
|

Updated on: Aug 07, 2021 | 9:17 AM

Share

Andhra Pradesh: ఆయనో పబ్లిక్ సర్వెంట్. జిల్లా పాలనా యంత్రాంగానికి బాస్ తరువాత బాస్. మరి అక్రమార్కుల చెరలో చిక్కి పబ్లిక్ ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకుంటారా?. అస్సలు ఊరుకోలేదు. తనదైన శైలిలో అక్రమార్కులకు చుక్కలు చూపించారు. ఆయనే విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. సినిమాటిక్‌గా ఎంట్రీ ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్న ఎరువుల షాపు యాజమాన్యానికి చుక్కలు చూపించారు. మారు వేషంలో తిరిగి.. ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న మోసాన్ని రట్టు చేశారు. ఆపై సదరు షాపులను సీజ్ చేయించారు.

పూర్తి వివరాల్లోకెళితే.. విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్.. సాధారణ రైతు వేషం ధరించి కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. అక్కడ ఓ ఎరువులు దుకాణానికి వెళ్లి ఎరువులు కావాలని అడగ్గా.. స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు యజమాని. అక్కడి నుంచి మరో షాప్‌కి వెళ్లారు. ఎరువులు కావాలని అడిగారు. సబ్‌కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చాడు ఆ షాపు యజమాని. అయితే, ఈ షాపు యజమాని ఎంఆర్‌పి ధర కన్నా అధికంగా వసూళ్లు చేశాడు. పైగా వసూలు చేసిన సొమ్ముకు బిల్లు కూడా ఇవ్వలేదు. వీరి చర్యతో ఆగ్రహానికి గురైన సబ్ కలెక్టర్.. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి షాపు వద్దకు పిలిపించారు.

స్టాక్ ఉన్నా లేదని చెప్పిన షాపు, అధిక ధర వసూలు చేసిన రెండు షాపులను సీజ్ చేయించారు. అక్కడి నుంచి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు. అయితే, ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసివేసి ఉండటంతో.. అక్కడి రైతులను వాకబు చేశారు. ఎంఆర్‌పి ధరల కన్నా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని సబ్ కలెక్టర్‌కి రైతులు తెలిపారు. దాంతో.. షాపు యజమానిని పిలిపించారు. షాపుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Also read:

Ambedkar Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? ఈ కీలక సమాచారం మీకోసమే..

Andhra Pradesh: ప్రమోషన్ ఇవ్వడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించండి..

JDU in Uttar Pradesh: కీలక ప్రకటన చేసిన జేడీయూ చీఫ్.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటూ..