AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: 3 రాష్ట్రాలను వణికించారు.. కట్‌చేస్తే.. విజయవాడలో అడ్డంగా బుక్కయ్యారు..

దేశంలోనే పేరుగాంచిన అతిపెద్ద బస్టాండ్లలో పండిట్ నెహ్రూ బస్టాండ్ ఒకటి.. ఇది ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అయితే ఓ గ్యాంగ్ విజయవాడ బస్టాండ్ ను టార్గెట్ చేసి... ప్రయాణికుల వద్ద దొంగతనాలకు పాల్పడుతుంది.. పోలీసులకు సమాచారం రావడంతో.. ఆ అంతర్రాష్ట్ర గ్యాంగ్ ను గుట్టురట్టు చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన కుప్రసిద్ధ పర్తి గ్యాంగ్ అని గుర్తించిన పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు.

Andhra News: 3 రాష్ట్రాలను వణికించారు.. కట్‌చేస్తే.. విజయవాడలో అడ్డంగా బుక్కయ్యారు..
Andhea News
M Sivakumar
| Edited By: Anand T|

Updated on: Nov 28, 2025 | 12:40 PM

Share

విజయవాడ బస్టాండ్ ను టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలకు  పాల్పడుతున్న  మహారాష్ట్రకు చెందిన కుప్రసిద్ధపర్తి గ్యాంగ్‌ను పట్టుకున్నారు పోలీసులు. ముఠా సభ్యులైన నలుగురిని అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. నిందితులను విచారించి వారి వద్ద నుంచి దొంగలించిన బంగారు ఆభరణాలు , నగదు , 5.44 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.. విజయవాడ కృష్ణలంక పోలీసుల అందిన సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నలుగురు నిందితులను అరెస్టులు చేశారు.

మొదట నవంబర్ 24న కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నవంబర్ 23న గుంటూరు వెళ్ళేందుకు పండిట్ నెహ్రూ బస్టాండ్ కు వచ్చాడు ..అనంతరం బస్సులో ఎక్కేటప్పుడు తన వద్ద ఉన్న రూ. 44 వేల దోపిడీకి గురైయ్యాయి. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా మరో రెండు దొంగతనాలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బస్టాండ్ లోని ఫ్లాట్ ఫామ్ , ఎంట్రీ ప్రదేశాలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను గంటలతరబడి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో పోలీసులు ఓ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. భారీ జనసంద్రంలో కలిసిపోయి ప్రయాణికుల టార్గెట్ చేస క్షణాల్లో ఈ గ్యాంగ్ తన చేతి వాటాన్ని ప్రదర్శించడాన్ని పోలీసులు గమనించారు.

పోలీసుల దర్యాప్తులో నిందితులు నవంబర్ 23న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ నుంచి నగదు.. మరో ప్రయాణికురాలు బ్యాగ్ నుంచి 26 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించినట్లు బయటపడింది. అలాగే నవంబర్ 25న మరో ప్రయాణికుడి బ్యాగ్ నుంచి 24 గ్రాముల బంగారం దొంగలించినట్లు తేలింది. ఈ గ్యాంగ్ పై మహారాష్ట్ర , రాజస్థాన్ , ఒడిస్సా , ప్రాంతాలలో పలు కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

గ్యాంగ్ కదలికల నేపథ్యంలో క్రైమ్ పోలీసులు బస్టాండ్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానితుల కదలికలు కనిపించడంతో సీతమ్మ విగ్రహ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగలించిన బంగారు ఆభరణాలు నగదు స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..