Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: బెజవాడ దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఇకపై సెల్ ఫోన్ నో ఎంట్రీ..

Vijayawada: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా కఠినంగా వ్యవహరించేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెల్ ఫోన్‌లను ఆలయంలోకి తీసుకెళ్లకుండా సెక్యూరిటీ ఏజెన్సీకి ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఆర్జిత సేవలను వీడియో తీయడం అధికమైంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అమ్మవారికి సాయంత్రం వేళ పంచహారతుల సేవ జరుగుతుండగా.. ఓ భక్తుడు సేవను వీడియో తీయడం ఆలయ..

Vijayawada: బెజవాడ దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఇకపై సెల్ ఫోన్ నో ఎంట్రీ..
Vijayawada Kanaka Durga Temple
Follow us
M Sivakumar

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 11, 2023 | 7:05 PM

విజయవాడ, ఆగస్టు 11: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ గుడిలోకి సెల్ ఫోన్‌ నిషేధం ఉంది. అయితే కొందరు భక్తులు మాత్రం అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి.. ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడమే కాదు.. అక్కడ వీడియోలు తీసిన ఘటనలు వెలుగులోకి రావడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా కఠినంగా వ్యవహరించేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెల్ ఫోన్‌లను ఆలయంలోకి తీసుకెళ్లకుండా సెక్యూరిటీ ఏజెన్సీకి ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఆర్జిత సేవలను వీడియో తీయడం అధికమైంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అమ్మవారికి సాయంత్రం వేళ పంచహారతుల సేవ జరుగుతుండగా.. ఓ భక్తుడు సేవను వీడియో తీయడం ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది గమనించి.. భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతుండటంతో.. ఆలయంలోకి సెల్ ఫోన్‌ నిషేధాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆలయ ఈవో అధికారులను ఆదేశించారు.

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునే సామాన్య భక్తులు.. సర్వదర్శనం క్యూలైన్ ద్వారా దర్శనం చేసుకుంటారు. అయితే.. క్యూలైన్‌లోకి ప్రవేశించే ముందుగానే.. భక్తులను సెక్యూరిటీ సిబ్బంది, సెల్‌ఫోన్ కౌంటర్ కాంట్రాక్టర్ సిబ్బంది తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే లోపలికి అనుమతిస్తారు. కొండ దిగువన మహా మండపం, టర్నింగ్ క్యూలైన్ల వద్ద ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే.. వీఐపీలు, సిఫార్సులపై వచ్చే వారు మాత్రం నేరుగా సమాచార కేంద్రానికి వెళ్లి.. అక్కడి నుంచి దర్శనానికి వెళ్తారు. ఇలా వచ్చే వారికి మాత్రం తనిఖీలు ఉండవు. దీంతో సెల్ ఫోన్‌లను తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఇక అమ్మవారి దర్శనం తర్వాత రాజగోపురం వద్ద వచ్చే సరికి అక్కడ.. అందరూ సెల్ ఫోన్‌లతో ఫోటోలు దిగుతూ.. కనిపించడంతో భక్తులకు, అధికారులకు తరచుగా గొడవలు జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి

అమ్మవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ఒక రూల్, వీఐపీలకు మరొక రూల్ అమలు చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఇక ముందు అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా.. సమాచార కేంద్రం, ప్రోటోకాల్ ఆఫీస్ వద్ద సెల్‌ఫోన్‌లను భద్రపరిచేలా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ఏఈవో, సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు ఈవో భ్రమరాంబ. ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ వాడితే.. వారికి జరిమానా విధించేలా చర్యలు తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ మేరకు ఆలయ సెక్యూరిటీ ఏజెన్సీతో పాటు పోలీస్, హోంగార్డు సిబ్బదికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.