S. P. Balasubrahmanyam: గాన గంధర్వుడి పేరిట కాలేజ్.. యూనివర్సిటీలో ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహం..
తెలుగు సంగీతం పండిత పామరుల్ని అలరించడంలో ఎంతో మంది కృషి ఉంది. అయితే అలాంటి వారిలో వేళ్ళ మీద లెక్కించదగిన వాళ్ళు కొందరే ఉన్నారు. వారిలో బాల సుబ్రమణ్యం ఒకరు. ఆయన మరణించిన తరువాత ఒక విశ్వవిద్యాలయం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన పేరు మీద లలిత కళల విభాగాన్ని ఏర్పాటు చేసింది.

ఎస్పీ బాల సుబ్రమణ్యం. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్యం లేదేమో… తన పాటతో తెలుగు వారితో పాటు భారతీయుల్ని ఉర్రూతలూగించిన ఎస్పీకి గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రత్యేక స్థానం కల్పించింది. ఇప్పటి వరకూ ఎంతో మంది విగ్రహాల్ని యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పాలకవర్గం మొదటిసారి తెలుగు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన బాల సుబ్రమణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో విసి రాజశేఖర్ తో పాటు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలుగు సంగీతం పండిత పామరుల్ని అలరించడంలో ఎంతో మంది కృషి ఉంది. అయితే అలాంటి వారిలో వేళ్ళ మీద లెక్కించదగిన వాళ్ళు కొందరే ఉన్నారు. వారిలో బాల సుబ్రమణ్యం ఒకరు. ఆయన మరణించిన తరువాత ఒక విశ్వవిద్యాలయం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన పేరు మీద లలిత కళల విభాగాన్ని ఏర్పాటు చేసింది.
తెలుగు పాటను విశ్వ వ్యాప్తం చేసిన ఆయన్ను కేంద్రం పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఏపీలో ఇప్పటి వరకూ లేనటువంటి ఎస్పీ బాల సుబ్రమణ్యం స్కూల్ ఆఫ్ ఫెర్ఫార్మింగ్, పైన్ ఆర్ట్స్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు విసి రాజశేఖర్ తెలిపారు.
ఈ కాలేజీలో ఔత్సాహికులకు నటనలో శిక్షణతో పాటు సంగీతంలో కూడా శిక్షణ ఇవ్వనున్నారు. సీని రంగం పట్ల యువత మక్కువ చూపుతుందని వారికి శిక్షణ ఇస్తే ఎంతో మంది నటి నటులతో పాటు సాంకేతిక నిపుణులు తయారవుతారని విసి చెప్పారు. సమాజాన్ని కళా రంగం చైతన్య పరుస్తుందని వీటిలో సినిమా ముందంజలో ఉందన్నారు.

Sp Balasubrahmanyam
ఏపీలో ఎక్కడా లేని విధంగా మొదటి బాల సుబ్రమణ్యం పేరుతో పైన్ ఆర్ట్స్ కాలేజ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తన మధుర గానంతో ఎంతో మందిని కట్టిపడేసిన బాలు గుర్తుగా ఈ కాలేజ్ మిగిలిపోవాలని ఎంతోమంది శిక్షణ పొంది అందరిని అలరించే సినిమాలు, నటి నటుల్ని తయారు చేయాలని పలువురు కోరుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.