AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వాహనదారులకు అలర్ట్.. వైసీపీ ప్లీనరీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే

గుంటూరు (Guntur) జిల్లా మంగళగిరి మండలంలోని పెద్దకాకాని జాతీయ రహదారి-16 వద్ద జరిగనున్న వై‌ఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈనెల 8, 9 తేదీల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని విజయవాడ...

Andhra Pradesh: వాహనదారులకు అలర్ట్.. వైసీపీ ప్లీనరీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Traffic
Ganesh Mudavath
|

Updated on: Jul 08, 2022 | 7:00 AM

Share

గుంటూరు (Guntur) జిల్లా మంగళగిరి మండలంలోని పెద్దకాకాని జాతీయ రహదారి-16 వద్ద జరిగనున్న వై‌ఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈనెల 8, 9 తేదీల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని విజయవాడ (Vijayawada) పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ మేరకు కొన్ని వాహనాలను దారి మళ్లించారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి. చెన్నై నుంచి విశాఖపట్నం (Visakhapatnam) వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్లించారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్‌ జంక్షన్‌ నుంచే దారి మళ్లించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు హనుమాన్‌జంక్షన్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు మళ్లిస్తారు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లించుకుని హనుమాన్‌ జంక్షన్‌ వైపు వెళ్తాయి.

రాత్రి 10గంటల తర్వాతే భారీ వాహనాలను జాతీయ రహదారిపైకి అనుమతిస్తారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి వచ్చే బస్సులు కాజ టోల్‌ప్లాజా వద్ద, కార్లు, బైక్ లు నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు. గంటూరు నుంచి వచ్చే బస్సులు నంబూరు, కార్లు, బైక్ లు కేశవరెడ్డి స్కూల్ వద్ద పార్కింగ్ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మార్పులను ప్రజలు గమనించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.