AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha Garjana: నేడు విశాఖ గర్జన.. వర్షం వచ్చినా తగ్గేదే లేదంటున్న జేఏసీ.. భారీగా తరలిరావాలని పిలుపు..

అభివృద్ధి వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని అంటోన్న జేఏసీ శనివారం విశాఖ గర్జన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఉదయం 9 గంటలకు విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభంకానుంది. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టనున్నారు. ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు...

Visakha Garjana: నేడు విశాఖ గర్జన.. వర్షం వచ్చినా తగ్గేదే లేదంటున్న జేఏసీ.. భారీగా తరలిరావాలని పిలుపు..
Vishakha Garjana
Narender Vaitla
|

Updated on: Oct 15, 2022 | 10:20 AM

Share

అభివృద్ధి వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని అంటోన్న జేఏసీ శనివారం విశాఖ గర్జన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఉదయం 9 గంటలకు విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభంకానుంది. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టనున్నారు. ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజలు భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

ఉదయం 9 గంటల తర్వా డాబా గార్డెన్స్‌కు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బీచ్‌ రోడ్‌లోని వైస్సార్‌ విగ్రహం వరకు వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. రాజకీయాలకు అతీతంగా భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు, అన్ని వర్గాల వారు దీనికి మద్ధతు పలకాలని జేఏసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలోనే భాగంగా ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

వర్షం వచ్చినా తగ్గేదేలే..

ఇదిలా ఉంటే ప్రస్తుతం విశాఖ నగంలో మోస్తారు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో విశాఖలో గడిచిన కొన్ని రోజులుగా వర్సాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు వర్షం వచ్చినా విశాఖ గర్జన యధావిధిగా నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ముందస్తు వర్ష సూచన నేపథ్యంలో జేఏసీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. గొడుగులు, రెయిన్ కోట్లతో కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..