AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US shooting: నేరుగా వచ్చి కౌంటర్‌లో ఉన్న తెలుగు వ్యక్తిపై కాల్పులు.. వీడియో

అమెరికాలోని అర్కాన్సాస్‌లోని కిరాణా దుకాణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. కాల్పుల్లో బిల్లింగ్ కౌంటర్ వద్ద ఉన్న ఏపీ వ్యక్తి గోపీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. అతను మరుసటి రోజు ఆసుపత్రిలో మరణించాడు. ఈ వార్త తెలియగానే బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలిలో ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.

US shooting: నేరుగా వచ్చి కౌంటర్‌లో ఉన్న తెలుగు వ్యక్తిపై కాల్పులు.. వీడియో
Gun Fire
Ram Naramaneni
|

Updated on: Jun 23, 2024 | 2:58 PM

Share

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్కాన్సాస్‌లోని ఒక కిరాణా దుకాణంలో శుక్రవారం ఒక షూటర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మృతుల్లో తెలుగు యువకుడు కూడా ఉన్నాడు. ఇద్దరు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సహా మరో 9 మంది గాయపడ్డారు. మృతుడిని ఆంధ్రాలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడి అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్ అనే చిన్న పట్టణంలోని మ్యాడ్ బుట్చేర్ కిరాణా దుకాణంలో పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా.. ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఆదివారం చనిపోయాడు.  ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.  మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన విజువల్స్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

అనుమానిత షూటర్‌ను న్యూ ఎడిన్‌బర్గ్‌కు చెందిన 44 ఏళ్ల ట్రావిస్ యూజీన్ పోసీగా పోలీసులు గుర్తించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను కూడా గాయపడ్డాడు. అతని గాయాలు ప్రాణాంతకం కావని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి