AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మండల పరిషత్ సమావేశానికి ఇలా వచ్చిన MPTC.. ఎందుకంటే..?

మాములుగా నిరసన తెలియజేస్తే ఏం ఉంటుంది.. ఏదైనా డిఫరెంట్‌గా చేస్తే కదా హైలెట్ అయ్యేది. అందుకే ఈయన వినూత్న విధానాన్ని ఫాలో అయ్యారు. ఇప్పటివరకు మీరు అనేక రకాల వినూత్న నిరసనలు చూసి ఉంటారు.. కానీ ఇలాంటి నిరసన ఇప్పటివరకు ఎవరు చేయలేదు... చూడలేదు.

Andhra: మండల పరిషత్ సమావేశానికి ఇలా వచ్చిన MPTC.. ఎందుకంటే..?
MPTC Vannur Sab
Nalluri Naresh
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 26, 2025 | 4:28 PM

Share

ఊర్లో కుక్కల బెడద అధికంగా ఉందని… అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఓ ఎంపీటీసీ వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేశాడు. కుక్క మాస్క్ ధరించి ఏకంగా మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వచ్చి నిరసన తెలిపాడు. కుక్కలు, కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడండి మహాప్రభువు అంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ వన్నూరు సాబ్ కుక్క మాస్క్ ధరించి హాజరయ్యారు. కుక్క మాస్క్ ధరించి… ప్లకార్డుతో మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో నిరసన వ్యక్తం చేశాడు.

చాలామంది ప్రజలు వీధి కుక్కల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని… అదే విధంగా ఉరవకొండలో విపరీతంగా కోతుల బెడదతో… కాలనీలు కిష్కిందగా మారుతున్నాయని… ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా… నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో… ఎంపీటీసీ వన్నూరు సాబ్ వినూత్నంగా ఆలోచించారు. కోతులు, కుక్కల బెడద సమస్యను మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలోని తేల్చుకోవాలని… ఏకంగా ముఖానికి కుక్క మాస్క్ ధరించి సమావేశంలో ఎంపీటీసీ నిరసన వ్యక్తం చేశారు. కుక్కలు, కోతులను పట్టుకుని ఊఅటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని అధికారులను కోరారు. ఎంపీటీసీ వన్నూరు సాబ్ చేసిన వినూత్న నిరసనతో…. ప్రజా ప్రతినిధులు, అధికారులు కంగుతిన్నారు. సమస్య తీవ్రత తెలియజేస్తూ… తన నిరసనను ఇలా వినూత్నంగా తెలియజేసిన ఎంపీటీసీ వన్నూరు సాబ్ పనికి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంపీటీసీ వన్నూరు సాబ్ చేసిన వినూత్న నిరసనకైనా అధికారులు స్పందిస్తారో?? లేదో?? చూడాలి.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..