AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏడాది తర్వాత కలిసిన భార్య.. కాసేపటికే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఏం చేశాడంటే?

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు.. భార్య బెంగళూరు, భర్త నెల్లూరులో ఉంటున్నారు. వీరిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. మనస్పర్థలు ఉన్నా అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. చాలా రోజుల తర్వాత బెంగళూరు నుంచి బార్య నెల్లూరు వచ్చింది. నెల్లూరు వచ్చిన భార్యను భర్త బస్ స్టేషన్‌కు వెళ్లి రిసీవ్ చేసుకున్నాడు. సీన్‌కట్‌చేస్తే ఇంటికి మాత్రం ఇద్దరిలో ఒక్కరే వెళ్లారు.. అసలు మార్గ మధ్యలో జరిగిందేంటో తెలిస్తే.. మీరు షాక్ అవ్వాల్సిందే.

Andhra News: ఏడాది తర్వాత కలిసిన భార్య.. కాసేపటికే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఏం చేశాడంటే?
Brutal Nellore Murder
Ch Murali
| Edited By: |

Updated on: Jan 31, 2026 | 6:18 PM

Share

చాలా రోజుల తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన భార్యను బస్టాప్‌ నుంచి పిక్ చేసుకున్న భార్య.. మార్గ మధ్యలోనే ఆమెను అతికిరాతకంగా హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు టౌన్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియాకి చెందిన నందిని, శ్రీహరి అనే దంపతులు, ఉద్యోగ రీత్యా చెరో నగరంలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వివాహబంధంలో మనస్పరదాలు రావడంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నప్పటికీ వీరు.. అప్పుడబ్బుడూ ఫోన్‌ చేసుకుంటూ, కలుస్తూ ఉండేవారు.

అయితే భార్య నందిని బెంగళూరు నగరంలో ఉద్యోగం చేస్తూ ఉండేది. అయితే ఇటీవల ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. జరిగిన గొడవలన్నీ మరిచిపోయి కలిసిమెలిసి జీవనం సాగించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని భర్త శ్రీహరి నందినీకి ఫోన్లో నచ్చజెప్పి నెల్లూరుకి రప్పించాడు. ఆమెను రిసీవ్ చేసుకునేందుకు భర్త శ్రీహరే బస్టాండ్ కూడా వెళ్ళాడు. బస్సు నుంచి దిగిన నందినిని ప్రేమగా రిసీవ్ చేసుకున్నాడు. స్కూటర్‌పై ఎక్కించుకొని మార్గమధ్యంలో పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను నిర్ధాక్షణంగా పొడిచి పొడిచి చంపాడు.

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. శ్రీహరి భార్యను హత్య చేయడానికి వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.