AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Godavari: ఏం మనుషులురా బాబు.. 80 పందెం కోళ్లను అగ్గికి ఆహుతి చేశారు

ఈర్ష్య, ద్వేషం.. ఒకడు బాగుపడితే ఓర్వలేనితనం.. ఎప్పుడు పక్కోడి మీద పడే ఏడుపు. కనీసం విలువలు ప్రజంట్ జనరేషన్‌లో చాలామంది వద్ద. లేకపోతే ఏంటండీ.. ఏకంగా 80 పందెం కోళ్లు ఉన్న మకాంకు నిప్పు పెట్టారు దుండగులు...

West Godavari: ఏం మనుషులురా బాబు.. 80 పందెం కోళ్లను అగ్గికి ఆహుతి చేశారు
Sankranthi Pandem Kollu
B Ravi Kumar
| Edited By: |

Updated on: Nov 11, 2024 | 5:25 PM

Share

సంక్రాంతి సమీపిస్తుంది. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా పందెం కోళ్లను సిద్ధం చేస్తున్నారు కోడిపుంజుల పెంపకం దారులు. జాతి పందెం కోడి లక్షకు పైగా ధర పలుకుతుంది. వీటి ఎగ్ బ్రీడ్, పోషణ, పెంపకం ప్రత్యేకంగా ఉంటాయి. పందెం కోడి ధర మినిమం పదివేల నుంచి మొదలవుతుంది. అదే నాటుకోడి పుంజు బరువును బట్టి రూ.2వేలకు పైమాటే. అందుకే కోడి పుంజుల పోషణను చాలా మంది గోదావరి జిల్లాల్లో ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నారు. హోదా , పేద – ధనిక భేదం లేకుండా రైతులు తమ కొబ్బరి, పామాయిల్… ఇతర తోటలు, వ్యవసాయ క్షేత్రాలు , ఖాళీ స్థలాల్లో కోడిపుంజులు పోషణ కోసం మకాంలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీటిలోనూ పోటీ తత్వమో, ఈర్ష్య కారణంగానో ప్రత్యర్ధులు ఆస్తి నష్టానికి సైతం వెనకాడడం లేదు. ఒక వైపు సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ పందెం కోళ్లు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మకాంలో సిబ్బంది నిద్రలో జారుకోగానే బుట్ట కింద కోళ్లను దొంగలు మాయం చేస్తుంటారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తారు.

అయితే పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. అగంతకులు మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో పందెం కోళ్ళ పెంపకం మకాంకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కోళ్ల రైతు కౌరు గోకన్నకు చెందిన 80 పందెం కోళ్ళు పూర్తిగా ఖాళీ బూడిద అయ్యాయి. కోడిపుంజులు సజీవ దహనం అయ్యి పాక పూర్తిగా కాలి పోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు రైతు గోకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో విక్రయించుకునేందుకు రూ. ఐదు లక్షలతో కోళ్లను కొనుగోలు చేసి పెంచుకుంటున్నానని ఈ ఘటనతో  తీవ్రంగా నష్ట పోయానని బాధితుడు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. చాలా పందెం కోళ్లు ఐరన్ కేజ్, బుట్టల్లోనే తగలబడి సజీవ దహనమయ్యాయి. తాళ్లతో కట్టి వేసి ఉండటం, బయటకు రావటానికి వీలు లేకుండా బుట్టల్లో ఉండటం వీటికి శాపంగా మారింది. ఈ ఘటన మొగల్తూరు ప్రాంతంలో ఇపుడు కలకలం రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..