AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వలలో చిక్కుకున్న 2 తలల పాము.. అది ఇంట్లో ఉంటే కుబేరులు అవుతారా..? ఇదిగో క్లారిటీ

ఒక తలపామును చూస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. ఇక రెండు తలల పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా..? అమ్మో అంటూ పరుగులు పెడతారు. అయితే..

Andhra Pradesh:  వలలో చిక్కుకున్న 2 తలల పాము.. అది ఇంట్లో ఉంటే కుబేరులు అవుతారా..? ఇదిగో క్లారిటీ
Two Headed Snake
Ram Naramaneni
|

Updated on: Mar 18, 2022 | 8:44 AM

Share

Viral Video: ఒక తలపామును చూస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. ఇక రెండు తలల పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా..? అమ్మో అంటూ పరుగులు పెడతారు. అయితే ఈ పాములు ప్రమాదకారులు ఏం కాదు. అయితే రెండు తలల పాములపై పలు పుకార్లు కూడా ఉన్నాయి. ఇవి దగ్గర ఉంటే కోటీశ్వర్లు అయిపోతారని.. కుబేరుడు ఇంట్లోనే తిష్టవేసుకుంటాడని కొందరు మాయగాళ్లు ప్రచారం చేస్తుంటారు. దీంతో ఇలాంటి రెండుతలల పాముల కోసం వేటగాళ్లు అడవులు మొత్తం గాలిస్తుంటారు. కనిపిస్తే సమాచారం ఇవ్వమని, పట్టిస్తే బహుమతి ఇస్తామంటూ అడ్వాన్సు లు సైతం ఇచ్చిన రోజులు సైతం ఉన్నాయి. అయితే సృష్టిలో మిగిలిన జీవుల్లా ఇది ఒక సాధారణమైన సర్పజాతికి చెందిన పాము మాత్రమేనని పోలీసులు, అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పిండంతో ఇపుడు ఈ తరహా పాముల స్మగ్లింగ్ కు కొంతమేర బ్రేక్ పడింది. తాజాగా ద్వారకాతిరుమల సత్తెనగూడెం రోడ్లో రెండు తలల పాము ఒక రైతుకు కనిపించింది. తోటలోని కోళ్ల షెడ్ కు పెట్టిన వలలో చిక్కుకున్న రెండు తలల పాము బయటకు రాలేక ఇబ్బంది పడుతుండటంతో దాన్ని  విడిపించాడు రైతు. వల నుండి పామును సురక్షితంగా బయటకు తీసిన రైతు ఈ సమాచారం ను ఫారెస్ట్ అధికారులకు అందచేశాడు.

కాగా, రెండు తలల పాముగా పిలిచే ‘రెడ్‌ సాండ్‌ బోవా’కు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీశాఖ అధికారులు తెలిపారు. దాని ఆకారం వల్ల అలా అనిపిస్తుందని చెప్పారు. దీని ద్వారా అదృష్టం కలిసిరావటమనేది అపోహేనన్నారు. 2 తలల పాము అమ్మకాలు జరిపినా, వాటికి అతీత శక్తులున్నాయని ఎవరైనా ప్రచారం చేసినా తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు. ఈ పాముకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు ఫిర్యాదు చేయాలన్నారు.

రిపోర్టర్ : బి. రవి కుమార్, టివి9 తెలుగు, పశ్చిమగోదావరి జిల్లా

Also Read: Viral: రక్తవర్ణంతో వర్షం.. ఎర్రగా మారిన నీలాకాశం.. భయాందోళనలకు గురైన ప్రజలు

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం