Andhra Pradesh: రెండు జిల్లాలకు సరిహద్దుగా ఆ స్ట్రీట్.. అయోమయ స్థితిలో ప్రజలు.. మన ఏపీలోనే.!
ఓ వీధిలో ఎదురెదురుగా చుట్టాలుగా ఉన్నవారు ఇప్పుడు అయోమయ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. అదేంటని ఆలోచిస్తున్నారా.?
ఓ వీధిలో ఎదురెదురుగా చుట్టాలుగా ఉన్నవారు ఇప్పుడు అయోమయ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. అదేంటని ఆలోచిస్తున్నారా.? ఆ వీధి ఇప్పుడు రెండు మండలాలు, రెండు నియోజకవర్గాలు కాదు.. రెండు వేర్వేరు జిల్లాలకు సరిహద్దుగా మారింది. ఇక ఈ ఘటన ఎక్కడో కాదు.. మన ఏపీలోనే చోటు చేసుకుంది.
ఇన్నాళ్లు ఆ గ్రామాలు రెండూ ఒకే జిల్లాలో ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం లో భాగంగా జిల్లాల పెంపుదల నేపథ్యంలో ఆ గ్రామాలు వేర్వేరు జిల్లాలకు వెళ్ళిపోయాయి. నిన్నటి వరకు ఇరుగుపొరుగు ఎదురెదురుగా చుట్టాలుగా ఉన్న మనుషులు ఒకేసారి వేరువేరు జిల్లాలవారు అయిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఇప్పుడిదే పరిస్థితి. రోడ్డు ఆనుకుని నివసిస్తున్నారు వారంతా పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందినవారు, వేరొక ప్రక్క తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన వారు.. అయితే తాడిపూడి తూర్పుగోదావరి జిల్లాలోకి గూటాల ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోవడంతో అక్కడ నివసిస్తున్న వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఎదురుగా ఉన్నా జిల్లాలు వేరవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఆ ఊరి జనాలు..