కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?
అది కలియుగ వైకుంఠం.. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం.. అన్నపూర్ణ నిలయంగా శ్రీవారి క్షేత్రం ఆకలికి చోటే లేని పవిత్ర స్థలంగా మారింది. రోజుకు 3 లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం అందిస్తోంది. వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.

అది కలియుగ వైకుంఠం.. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం.. అన్నపూర్ణ నిలయంగా శ్రీవారి క్షేత్రం ఆకలికి చోటే లేని పవిత్ర స్థలంగా మారింది. రోజుకు 3 లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం అందిస్తోంది. వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలువైన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. తిరుమల అంటే కడుపు నిండే క్షేత్రం. ఆకలి అనేది ఇక్కడ భక్తుడికి తెలియని పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది..
శ్రీవారి కృపతో పాటు, టీటీడీ అన్నప్రసాద విభాగం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ వ్యవస్థ ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల మంది భక్తులు తృప్తికరమైన భోజనం స్వీకరిస్తున్నారు.
భక్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నప్రసాదం విభాగం..
టీటీడీ అన్న ప్రసాదం విభాగం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, శ్రీ అక్షయ, వకుళమాత.. అనే మూడు వంటశాలలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి.
శ్రీవారి సన్నిధికి వచ్చిన భక్తుడికి ఆకలి మరిచి పోయేలా అన్నప్రసాదం అందిస్తున్నాయి. వైకుంఠం క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తుడైనా, డైనింగ్ హాల్‌లో కూర్చున్న యాత్రికుడైనా, బయట ప్రాంతాల్లో వేచి ఉన్నవారైనా, ఎవరూ ఆకలితో ఉండకుండా చూడటమే టీటీడీ లక్ష్యం.. ఇలా అన్నపూర్ణ నిలయంగా తిరుమల క్షేత్రంగా మారింది.
అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ప్రతి రోజూ 74 వేల మంది, శ్రీ అక్షయ వంటశాల రోజుకు 1.48 లక్షల మందికి, వకుళమాత వంటశాల రోజుకు 77 వేల మంది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. మాజీ సీఎం ఎన్టీఆర్ సంకల్పంతో 1985 ఏప్రిల్ 6న తిరుమలలో శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. 1994 ఏప్రిల్ 1న ఈ పథకాన్ని ట్రస్టుగా మార్చడం జరిగింది.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా ప్రారంభించడం జరిగింది.
అన్న ప్రసాద విభాగం రోజువారీ తయారు చేసే అన్న ప్రసాదాల వివరాలు ఇవి..
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో..
ఉదయం… గోధుమ రవ్వ ఉప్మా/ సూజి రవ్వ ఉప్మా/ సేమియా ఉప్మా/ పొంగలి, చట్ని, సాంబార్.
మధ్యాహ్నం (8 రకాలు).. స్వీట్ పొంగల్, అన్నం, కర్రీ, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ.
సాయంత్రం (8 రకాలు)… స్వీట్ పొంగల్, అన్నం, కర్రీ, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ.
శ్రీ అక్షయ వంటశాలలో..
గోధుమ రవ్వ ఉప్మా/సొజ్జి రవ్వ ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోట రైస్, సుండలు, పాలు, టీ, కాఫీ తయారు చేస్తారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాలు, ముఖ్యమైన రోజుల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా ఇక్కడ నుండి భక్తుల కోసం పంపిణీ చేస్తారు.
వకుళమాత వంటశాలలో…
వకుళమాత వంటశాలలో యాత్రికుల వసతి సముదాయం-2, 4, 5 లోని భోజనశాలలకు, బయట ప్రాంతాల్లోని కేంద్రీయ విచారణ కార్యాలయం, యాత్రికుల వసతి సముదాయం-1, రామ్ భగిచా అతిథి గృహం, అంజనాద్రి నిలయం కాటేజీల వద్ద ఉన్న భక్తులకు పంపింణీ చేసేందుకు సాబారన్నం, పెరుగన్నం, ఉప్మా తయారు చేస్తారు.
దాదాపు వెయ్యి మంది అన్న ప్రసాద విభాగం సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు ఎప్పటికప్పుడు అంతరాయం లేకుండా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
