AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Eamcet 2023 Results: తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్ధులు.. టాప్‌ 3 ర్యాంకులన్నీ వారివే

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు గురువారం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంసెట్‌ ఫలితాల్లో టాప్‌ 3 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్ధులు కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో..

TS Eamcet 2023 Results: తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్ధులు.. టాప్‌ 3 ర్యాంకులన్నీ వారివే
TS Eamcet 2023 Toppers
Srilakshmi C
|

Updated on: May 25, 2023 | 11:05 AM

Share

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు గురువారం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంసెట్‌ ఫలితాల్లో టాప్‌ 3 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్ధులు కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ (158.89) సాధించిన అనిరుద్‌ సనపల్ల.. విశాఖపట్నంకి చెందినవాడు. సెకండ్‌ ర్యాంక్‌ (156.59)లో నిలిచిన ఎక్కంటిపాని వెంకట మనిందర్‌ రెడ్డి గుంటూరుకు చెందిన విద్యార్ధి. మూడో ర్యాంక్‌ (156.94) సాధించిన చల్లా రమేష్ కృష్ణా జిల్లా నందిగామ వాసి. టాప్‌ మూడు ర్యాంకర్లు ఆంధ్రా విద్యార్ధులు కొల్లగొట్టడం విశేషం. ఇక నాల్గవ ర్యాంక్‌ అభినిత్ మంజేటి (156.58) తెలంగాణ కొండాపూర్‌, 5వ ర్యాంక్‌ ప్రమోద్‌ కుమార్‌ తాడిపత్రికి చెందినవాడు.

అగ్రికల్చర్‌, ఫార్మసీలో టాప్‌ ర్యాంకర్లు

అగ్రికల్చర్‌, ఫార్మసీలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన బురుగుపల్లి సత్య ఈస్ట్ గోదావరికి చెందినవాడు. చీరాలకు చెందిన నాసిక వెంకట తేజ రెండో ర్యాంక్‌, తెలంగాణలోని రంగారెడ్డికి చెందిన సఫల్‌ లక్ష్మి పసుపులేటి మూడో ర్యాంక్‌, తెనాలికి చెందిన దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి నాల్గవ ర్యాంక్‌ , శ్రీకాకుళంకు చెందిన బోర వరున్‌ చక్రవర్తి 5వ ర్యాంకు సాధించారు.

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఈసారి అబ్బాయిలు హవా చాటారు. ఇంజనీరింగ్‌, అగ్రకల్చర్ స్ట్రీమ్‌లలో టాప్‌ ర్యాంకులన్నీ అబ్బాయిలే సాధించారు.రానున్న రెండు మూడు రోజుల్లో అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సబిత వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి