ఈ విద్యార్థుల పరిస్థితి చూస్తే హృదయం చలించక మానదు.. దిన దిన గండంగా మారిన రోప్ వే ప్రయాణం

మన్యం ప్రాంతం అంటే దట్టమైన అందమైన అటవీ ప్రాంతం, వాగులు, వంకలు అందమైన ప్రదేశాలు అని అందరూ అనుకుంటారు.. కానీ  వాగులు, వంకలు, దట్టమైన..

ఈ విద్యార్థుల పరిస్థితి చూస్తే హృదయం చలించక మానదు.. దిన దిన గండంగా మారిన రోప్ వే ప్రయాణం
Bandamamidi
Follow us
Subhash Goud

|

Updated on: Oct 14, 2022 | 9:45 PM

మన్యం ప్రాంతం అంటే దట్టమైన అందమైన అటవీ ప్రాంతం, వాగులు, వంకలు అందమైన ప్రదేశాలు అని అందరూ అనుకుంటారు.. కానీ  వాగులు, వంకలు, దట్టమైన అడవులు వెనుక గిరిపుత్రుల కష్టాలు ఎవ్వరికీ తెలియదు.. మన్యం గ్రామాల్లో అనేక సమస్యలు దాగి ఉంటాయి. ఇదుగో ఇప్పుడు మీరు చూస్తున్న గ్రామంలో వాగు పై వంతెన సమస్య కొన్నేళ్లుగా వారిని వెంటాడుతుంది. బావి తరాలకు బాటలు వేసే అధికారులే ఆ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఏపీలోని అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం బంధమామిడి గ్రామంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ కాలం వెల్లదిస్తున్న వైనం ఇది.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం బందమామిడి గ్రామస్తులు సర్కస్ ఫీట్లు తలపించేలా కాలువ దాటేందుకు రెండు వైపులా ఇనుప చువ్వ వైర్లను చెట్లకు కట్టి ప్రాణాలు పణంగా పెట్టీ ప్రమాదకర స్థితిలో ప్రయాణం కొనసాగిస్తున్నారు.  బంధమామిడి గ్రామానికి సంబందించిన విద్యార్థులు, గ్రామస్తులకు ఈ వంతెన సమస్య ఎన్నేళ్ళు నుండి ఉన్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ వాగులో ఉన్న చెట్టు పైకి ఎక్కి ఆ వైర్లు పట్టుకుని వాగు దాటుతుంటే ఎవరైనా ప్రాణం విలవిలాడాల్సిందే.

మన్యం ప్రాంతం రంపచోడవరం మండలం బంధమామిడి గ్రామంలో వాగు పై వంతెన సమస్య ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్లుగా ఉంది. ఉదృతంగా ప్రవహిస్తున్న భూపతి పాలెం వాగుపై నుండి ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఒక్కసారిగా వాగు పొంగిందంటే వాగులో కొట్టుకెళ్లి పోవాల్సిందే. గ్రామస్తులు, విద్యార్ధులు.. అధికారులకు చెప్పి చెప్పి విసుగు చెంది చివరకు ప్రాణాలకు తెగించి తాత్కాలికం ఏర్పాటు చేసుకున్న మూడు ఇనుప తీగల పైనే భయానకరంగా వాగును దాటుతున్నారు.  గ్రామం నుండి అత్యవసరంగా ఎక్కడికి వెళ్లాలన్నా స్కూల్ కి వెళ్ళాలి అన్న కాలేజీకి వెళ్లాలన్న చుట్టూ తిరిగి వెళితే గాని రంప చోడవరం  గ్రామం రాదు. దీంతో చేసేది లేక అభం శుభం తెలియని విద్యార్థినిలు విద్యార్థులు కాలేజీ స్టూడెంట్స్ తాత్కాలికంగా వైర్లతో కట్టుకునీ వాగు దాటుతున్నారు.

బందమమిడి నుండి రంపచోడవరం, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్న సుమారు ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్లు మేర పాడైన రోడ్ గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బంధమామిది గ్రామంలో సుమారు 30 నుండి 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 300 మందికి పైగా గ్రామస్తులు ఉన్నారు. నిత్యావసరాలను, రోజు వారి పనులకై స్కూల్, కాలేజ్ వెళ్ళే విద్యార్దులకు సైతం బండమామిడి నుండి రంపచోడవరం వెళ్లాలంటే ఈ వైర్ల సాయంతో క్షణాల్లో చేరుకుంటారు. వాగు పై బ్రిడ్జి సమస్య ఇప్పటిది కాదని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇనుప వైర్ల నుండి పడి గతంలో చాలామంది ప్రమాదాల బారిన పడ్డారని గ్రామస్తులు గాయాలను చూపిస్తున్నారు. ఒకరిద్దరూ మృత్యువాత కూడా పడ్డారని టీవీ9 తో వాపోయారు.

ఇవి కూడా చదవండి

బందమామిడి వద్ద ఇనుప వైర్ల సహాయంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతం నుండి సమస్య పై కవర్ చేస్తున్న టీవీ9 బృందం ఎదురుగానే ఓ విద్యార్థి ఇనుప వైర్లా పై వెళుతూ ఒక్కసారిగా వాగులో పడిపోతున్న దృశ్యాలు టీవీ9 కెమెరాకు చిక్కాయి . అక్కడి సమస్యను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న టీవీ9 బృందం గ్రామస్థుల అప్రమత్తతో గ్రామానికి చెందిన విద్యార్దిని సురక్షితంగా ఇతకొట్టుకుంటు  ప్రాణాలతో బయట పడ్డాడు. అల్లూరు జిల్లా మన్యం ప్రాంతం బందమామిడి గ్రామంలో వంతెన సమస్యపై అధికారులు పట్టించుకోకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు… వాగులో కొట్టుకొచ్చిన భారీ వృక్షానికి ఇరువైపులా ఇనుప చువ్వలను తాత్కాలికంగా కట్టుకొని ప్రాణాలకు తెగించి భూపతి పాలెం వాగును ఏవిధంగా విద్యార్ధులు దాటుతున్నరో ఈ వీడియోలో చూడవచ్చు.

బందమామిడి గ్రామంలో వాగు పై వంతెన సమస్య ఇప్పటిది కాదని గ్రామం నుండి రంపచోడవరం వెళ్ళాలంటే సుమారు ఎనిమిది కిలోమీటర్లు మేర నడీవీధీ,పందిరి మామిడి.. ఇతర గ్రామాల మీదుగా వెళ్లాల్సి వస్తుందని, ఆసుపత్రికి అత్యవసరంగా వెళ్లాలన్న చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఇబ్బందులు పడుతున్నారు.108 రావాలన్న ఆ ఇరుకు రోడ్ల పై నుండి రావాల్సిందే. అధికారులు చుద్దములే, చెద్దాములే అన్న హామీలు తప్ప   ఈ చిన్నపాటి సమస్యను తీర్చలేక పోతున్నారని టీవీ9 తో గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల జీవితాలకు దారి చూపించాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు.

ఏది ఏమైనప్పటికీ ఎన్నో ఏళ్లగా ఇబ్బందులు పడుతున్న బంధమామిడి గ్రామస్తులు సుమారు గ్రామాల్లో  300మందికి పై గా ఉన్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు వాగులు దాటుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఈ గ్రామానికి ఉన్న ఈ చిన్న పాటి వంతెన సమస్యను తీర్చాలని గిరిజన గ్రామస్తుల తరఫున టీవీ9 కూడా కోరుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్