AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: గుర్రాలపై బయలుదేరిన గిరిజనులు.. ప్రయాణం కాదు.. మరి ఎందుకో తెలుసా..?

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కొండ కోనల్లో నివాసం ఉంటారు.. వారికి కనీస సౌకర్యాలు ఆమడ దూరం.. రోగమొచ్చినా.. వైద్యం కావాలన్నా కిలోమీటర్ల కాలినడకనే వాళ్ళ ప్రయాణం... డోలిమోతలే వాళ్లకు దిక్కు..! ఇక అత్యవసరం అయితే.. దేవుడిపై భారం వేయడమే.. ఎన్నో ఏళ్లుగా ఈ గిరిజనులు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇటీవల వారి కష్టాలు తీరినట్టు ఆశలు చిగురించాయి.

Andhra: గుర్రాలపై బయలుదేరిన గిరిజనులు.. ప్రయాణం కాదు.. మరి ఎందుకో తెలుసా..?
Andhra Tribes' Horse Protest
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 26, 2025 | 3:51 PM

Share

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కొండ కోనల్లో నివాసం ఉంటారు.. వారికి కనీస సౌకర్యాలు ఆమడ దూరం.. రోగమొచ్చినా.. వైద్యం కావాలన్నా కిలోమీటర్ల కాలినడకనే వాళ్ళ ప్రయాణం… డోలిమోతలే వాళ్లకు దిక్కు..! ఇక అత్యవసరం అయితే.. దేవుడిపై భారం వేయడమే.. ఎన్నో ఏళ్లుగా ఈ గిరిజనులు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇటీవల వారి కష్టాలు తీరినట్టు ఆశలు చిగురించాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ రోడ్డు కష్టాలు తీరలేదు… దీంతో ఇక చేసేది లేక గుర్రాలపై నిరసనకు బయలుదేరారు. అల్లూరి జిల్లా అనంతగిరి ఏజెన్సీలో గిరిజనుల వినూత్న నిరసన తెలిపారు. గుర్రాలపై మాడ్రేబు నుంచి గుర్రాల బయలు వరకు ప్రదర్శన చేశారు. పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో రోడ్లు వేసి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన రోడ్లకు మోక్షం కల్పించాలని విన్నవించారు.

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట, పెద్దకోట, జీనబాడు పంచాయతీ పరిధిలో 11 గ్రామాల్లో సుమారు 2500 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. గత డిసెంబర్లో పవన్ కళ్యాణ్ పర్యటనలో గుమ్మతి నుండి రెడ్డి పాడువరకు 12 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జనవరి నెలలో బీటీ రోడ్డు నిర్మాణం నిమిత్తం సుమారు 11 కోట్ల 66 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు మంజూరై ఏడు నెలలు కావస్తున్నా పనులు ప్రారంభించలేదు. దీంతో ఆ గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. రేషన్ తెచ్చుకోవాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రులకు వెళ్లాలన్నా వ్యయ ప్రయాసలు చెందాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు.

వీడియో చూడండి..

ఈ గ్రామాల పరిధిలో 8 ప్రాథమిక పాఠశాలలు, 8 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులు స్కూలుకు వెళ్లాలన్నా, పోషకాహారం, రేషన్ తరలించాలన్నా.. గుర్రాలను ఆశ్రయించాల్సి వస్తుంది. లేని వాళ్ళు కిలోమీటర్ల మేర మోసుకొని సరుకులను తీసుకు వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు పనులను ప్రారంభించాలని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు. గుర్రాలపై ప్రయాణం చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. రోడ్డు నిర్మాణం ప్రారంభించకపోతే ఆదివాసి దినోత్సవం నాడు భారీ ఎత్తున డోలి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..