Watch Video: ఓర్నాయనో.. అరకులో భయంతో పరుగులు తీసిన పర్యాటకులు.. ఎందుకో తెలుసా..?
ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు లోయలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది.. ఉదయం దట్టమైన పొగ మంచు.. ఆ తర్వాత కాస్త ఎండ.. ఆ తర్వాత దట్టంగా మబ్బులు కమ్ముకుని వర్షం..! గత కొంతకాలంగా ఇదే పరిస్థితి ఏజెన్సీలో చాలా చోట్ల ఉంది. దీంతో పర్యటకులు అరకులోయకి క్యూ కడుతున్నారు.

ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు లోయలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది.. ఉదయం దట్టమైన పొగ మంచు.. ఆ తర్వాత కాస్త ఎండ.. ఆ తర్వాత దట్టంగా మబ్బులు కమ్ముకుని వర్షం..! గత కొంతకాలంగా ఇదే పరిస్థితి ఏజెన్సీలో చాలా చోట్ల ఉంది. దీంతో పర్యటకులు అరకులోయకి క్యూ కడుతున్నారు. దీంతో అరకు లోయలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. బొర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, చాపరాయితోపాటు.. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ కు సందర్శకులు భారీగా పెరిగారు. అందరూ ఎవరి ఎంజాయ్‌మెంట్లో వాళ్ళు ఉన్నారు. అయితే పద్మాపురం గార్డెన్స్‌లో.. ఒక్కసారిగా అలజడి రేగింది. భయంతో పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు.. అక్కడ ఓ భారీ నాగుపాము కనిపించినట్టు చెప్పారు కొంతమంది టూరిస్టులు. దీంతో వెళ్లి ఆ ప్రాంతం చూసేసరికి.. పెద్ద నాగు పాము పడగవిప్పి బుసలు కొడుతోంది. పర్యాటకుల అలికిడి పెరగడంతో.. మరింత కోపంతో మరింత పడగవిప్పి అటు ఇటు తిరుగుతుంది.
దీంతో తీవ్ర భయాందోళన గురైన స్థానికులు, పర్యాటకులు.. స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కృష్ణ.. బుసలు కొడుతున్న నాగుపామును అత్యంత చాకచక్యంగా బంధించాడు.
వీడియో చూడండి..
అనంతరం సమీపంలోని అడవుల్లో ఆ పామును విడిచి పెట్టాడు. దీంతో పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో వాతావరణ పరిస్థితులు మార్పులతో పాములు జనాభాసాల్లోకి వచ్చేస్తున్నాయని.. గత వారం రోజుల్లోనే ఐదు వరకు పాములను రెస్క్యూ చేశానని అంటున్నాడు స్నేక్ క్యాచర్ కృష్ణ..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
