AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్.. ఉచిత దర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు.. ఇక నుంచి..

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎస్‌డీ ఉచిత దర్శన టోకెన్ల జారీ సమయాలను మార్చింది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో టికెట్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు రద్దీ తగ్గడంతో సమయంలో మార్పులు చేశారు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్.. ఉచిత దర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు.. ఇక నుంచి..
Tirumala Darshan
Venkatrao Lella
|

Updated on: Jun 20, 2026 | 11:12 AM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను(ఎస్‌ఎస్‌డీ) ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ చేస్తోంది. ఈ టోకెన్లు జారీ చేసే సమయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉదయం 5 గంటలకు వీటిని అందిస్తున్నారు. అయితే ఇక నుంచి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. శుక్రవారం నుంచే ఈ సమయాల్లో మార్పులు చేశారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌డీ దర్శన టికెట్లను అందిస్తోంది. రైల్వే స్టేషన్ పక్కన ఉండే విష్ణునివాసం, బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టోకెట్లను అందిస్తున్నారు. రోజుకు 15 వేల టోకెన్ల వరకు జారీ చేస్తున్నారు.

సమయంలో మార్పులు..

కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లేవారి కోసం మరో 2 వేల టోకెన్లను అందిస్తున్నారు. ఓరిజినల్ ఆధార్ లేదా ఆధార్ కార్డు జిరాక్స్ అందిస్తే మీ ఫొటో తీసుకుని ఈ దర్శనం టోకెన్ ఉచితంగా అందిస్తారు. అయితే రెండు, మూడు గంటల పాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో జారీ చేశారు. ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడం, వేసవి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ తగ్గింది. దీంతో టికెట్లు అందించే సమయాల్లో మార్పులు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు

అటు జూన్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పో్త్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను టీటీడీ జేఈవో శరత్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా విద్యుత్, త్రాగునీరు, దర్శన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పల ఫిట్‌నెస్ పరిశీలించేలా ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. విద్యుత్, పుష్పాల అలంకరణలతో తెప్పలను తీర్చిద్దాలని తెలిపారు. ఇక కోలాటాలు, సంగీత కచేరీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Follow Us
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
బిజీ లైఫ్‌లో భాగస్వామితో గడిపే టైమ్‌ లేకుండా పోయిందా? ఈ అలవాట్లతో
బిజీ లైఫ్‌లో భాగస్వామితో గడిపే టైమ్‌ లేకుండా పోయిందా? ఈ అలవాట్లతో
కోహ్లీ లాంటి ఫిట్‌నెస్ కోసం.. పిల్లలకు ఇవి పెట్టండి!
కోహ్లీ లాంటి ఫిట్‌నెస్ కోసం.. పిల్లలకు ఇవి పెట్టండి!
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
33 సిక్సర్లు, 44 ఫోర్లు.. 493 పరుగులతో ఎంపీ కొడుకు ఊచకోత
33 సిక్సర్లు, 44 ఫోర్లు.. 493 పరుగులతో ఎంపీ కొడుకు ఊచకోత
ప్రోటోకాల్ పంచాయితీ.. గృహలక్ష్మి లక్కీ డ్రా నుంచి దానం వాకౌట్!
ప్రోటోకాల్ పంచాయితీ.. గృహలక్ష్మి లక్కీ డ్రా నుంచి దానం వాకౌట్!
డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..