AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల డేట్‌లు వచ్చేశాయ్!

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం 2026 మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు టికెట్లకు జారీ తేదీలను విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ డిప్‌లో పేర్ల నమోదు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నట్టు ప్రకటించిది.

TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల డేట్‌లు వచ్చేశాయ్!
Release Of Tickets For Srivari Arjitha Services
Anand T
|

Updated on: Feb 16, 2026 | 7:30 PM

Share

శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్‌ అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం 2026 మే నెలకు సంబంధించి  శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.  అలాగే 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదలవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది టీటీడీ.

వర్చువల్ సేవల కోటా విడుదల

ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అలాగే ఈ నెల  23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. అంతేకాదు 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

ఇక ఈ నెల 23 మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. అలాగే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది.

ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అలాగే 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. దీనితో పాటు 27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్  ద్వారా బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us