Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. గురువారం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల.. ఇలా బుక్‌ చేసుకోండి

Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. గురువారం (ఆగస్టు 18) రూ. 300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. గురువారం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల.. ఇలా బుక్‌ చేసుకోండి
TTD
Follow us
Basha Shek

|

Updated on: Aug 18, 2022 | 9:15 PM

Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. గురువారం (ఆగస్టు 18) రూ. 300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది. ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచనుంది. వివిధ స్లాట్లలో టికెట్లను కేటాయించామని, శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌  ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను చూసి మోసోవద్దని హెచ్చరించింది.

ఆరోజుల్లో సర్వదర్శనం మాత్రమే..

కాగా ఈనెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ రోజుల్లో కేవలం సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తామని, సర్వదర్శనం మాత్రమే అమలులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా  బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. కాగా మరోవైపు రేపు వాచీల ఈ-వేలం జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన వాచీలను వేలం వేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి:  టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..