శివ.. నాకు భయమేస్తుంది.. నన్ను మార్చండి.. నిందితురాలు పద్మజ జైల్లో తొలిరోజు ఎలా గడిపిందంటే..

మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో కన్న కూతుళ్ళను మూడ భక్తితో హత్య చేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందుతులు

  • Rajitha Chanti
  • Publish Date - 2:09 pm, Thu, 28 January 21
శివ.. నాకు భయమేస్తుంది.. నన్ను మార్చండి.. నిందితురాలు పద్మజ జైల్లో తొలిరోజు ఎలా గడిపిందంటే..

మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో కన్న కూతుళ్ళను మూడ భక్తితో హత్య చేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందుతులు పురుషోత్తం నాయుడు, పద్మజను పోలీసులు మదనపల్లె సబ్ జైలులో ఉంచారు. ఇక మొదటి రోజు జైల్లో ఉన్న నిందుతురాలు పద్మజ పెద్దగా అరుస్తూ.. నానా హడావిడి చేసింది. పద్మజను ఉంచిన గదిలో గోడలపై శివుడి బొమ్మలు గీసి పూజలు చేసింది. ఆ తర్వాత తనకు ఒంటరిగా ఉంటే భయమేస్తుందని, అందరితో కలిసి ఉంటానని పద్మజ పోలీసులకు తెలిపింది. ఆమె కోరిక మేరకు మహిళా ఖైదీలు ఉన్న బ్యారక్‏లోకి పద్మజను మార్చారు పోలీసులు. ఆ గదిలోకి మార్చిన తర్వాత.. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి నిందుతురాలు పద్మజ సైలెంట్‏గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మూఢభక్తితో ఇద్దరు కూతుళ్ళను అత్యంత కిరాతకంగా డంబెల్స్‏తొ కొట్టిచంపారు పద్మజ, పురుషోత్తంనాయుడు. చనిపోవడానికి కొద్దిరోజుల ముందు అలెఖ్య, సాయిదివ్య రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, ముగ్గును తొక్కారు. ఆ తర్వాతి రోజు నుంచి సాయిదివ్య చనిపోతానేమో అనే భయంలో ఉండగా.. అలేఖ్య ఆ అనుమానాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ వచ్చింది. రోజూరోజూకి భయంతో సాయిదివ్య గట్టిగా ఏడుస్తుండటంతో.. తనకు పట్టిన దయ్యాన్ని వదింలించాలని డంబెల్‏తో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత చెల్లి ఆత్మను తీసుకువస్తానని అలెఖ్య తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అదే రోజు సాయంత్రం అలేఖ్య నోటిలో రాగి కలశం పెట్టి డంబెల్‏తో కొట్టగా.. తాను కూడా మరణించింది. తాను కూతుళ్లను చంపినట్లుగా పురుషోత్తం నాయుడు తన సహచర ఉద్యోగికి కాల్ చెప్పాగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:

కుక్కను బతికించా.. చెల్లి ఆత్మనీ రప్పిస్తా.. హరర్‌ మూవీని తలపిస్తున్న మదనపల్లె కేసు..