కుక్కను బతికించా.. చెల్లి ఆత్మనీ రప్పిస్తా.. హరర్‌ మూవీని తలపిస్తున్న మదనపల్లె కేసు..

ఒక హరర్‌ మూవీలో కూడా ఇన్ని ట్విస్ట్‌లు ఉండవు.. కాని ఈ కేసులో మాత్రం రోజుకో ట్విస్ట్‌ బయటికి వస్తుంది..హరర్‌ మూవీని మించి సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది..థ్రిల్లర్‌ మూవీ తలపించే ఈ కేసులో మరో షాకింగ్‌ న్యూస్..

కుక్కను బతికించా.. చెల్లి ఆత్మనీ రప్పిస్తా.. హరర్‌ మూవీని తలపిస్తున్న మదనపల్లె కేసు..
Follow us

|

Updated on: Jan 28, 2021 | 9:35 AM

Madanapalle Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మదనపల్లి కేసు..ఇప్పుడు మరో మలుపు తీసుకుంది..ఒక హరర్‌ మూవీలో కూడా ఇన్ని ట్విస్ట్‌లు ఉండవు.. కాని ఈ కేసులో మాత్రం రోజుకో ట్విస్ట్‌ బయటికి వస్తుంది..హరర్‌ మూవీని మించి సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది..థ్రిల్లర్‌ మూవీ తలపించే ఈ కేసులో మరో షాకింగ్‌ న్యూస్‌ బయటికి వచ్చింది..అసలు దివ్యని చంపింది తల్లిదండ్రులా.. లేదా అక్క అలేఖ్యనా.. మదనపల్లె మర్డర్‌ అసలు స్కెచ్‌ ఎవరిది..అంతా చేసింది..అక్కేనా.? ఇప్పుడే ఇదే డౌట్‌ రైజ్‌ అవ్వుతోంది..చెల్లి దివ్య చనిపోవడానికి రీజన్‌ అక్క అలేఖ్యనేనా.. అంటే అవుననే అనిపిస్తోంది..పోలీసులు బయటపెట్టిన రిమాండ్‌ రిపోర్ట్‌ చూస్తే ఖచ్చితంగా షాక్‌ అవ్వాల్సిందే..

మర్డర్‌ కేసులో అసలు నిజాలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇటీవల వెలుగుచూసిన జంట హత్యల కేసులో రిమాండ్ రిపోర్టు వెల్లడైంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన మదనపల్లె మర్డర్‌ కేసులో అసలు నిజాలు బయటకు వచ్చాయి..మదనపల్లి కేసు ఊహించని మలుపు తీసుకుంది..మూర్ఖత్వం, మూఢ భక్తి ఇద్దరు బిడ్డలను బలి తీసుకున్న మదనపల్లె కేసులో ఒక్క కొత్తకోణం వెలుగుచూసింది..ఇప్పటికి ఈ జంటహత్య కేసులో తల్లిదండ్రలు కారణంగా భావిస్తున్న పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌తో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు..అసలు ఈ హత్యకు కారణం అక్క అలేఖ్య అని తాజాగా బయటపడింది..చెల్లిని చంపేలా అలేఖ్య తల్లిదండ్రులను ఫోర్స్‌ చేసినట్లు రిపోర్ట్‌లో తేలింది.

అసలేం జరిగిందంటే…

రిమాండ్ రిపోర్టు ప్రకారం అసలేం జరిగిందంటే… ఇటీవల ఓ మంత్రపు ముగ్గును తొక్కినట్టు పద్మజ, పురుషోత్తంనాయుడుల చిన్నకుమార్తె సాయిదివ్య భావించింది. మరుసటి రోజు నుంచి ఆ అమ్మాయి అనారోగ్యంపాలైంది. చనిపోతానేమో అని విపరీతంగా భయపడింది.అయితే ధైర్యం నింపాల్సిన ఆమె అక్క అలేఖ్య అందుకు భిన్నంగా వ్యవహరించింది. తన చెల్లెలు దివ్యను చనిపోవాలని ప్రోత్సహించింది. ఈ క్రమంలో ఈ నెల 23న భూతవైద్యం చేయించారు. ఆ మరుసటి రోజు దివ్య వింతగా ప్రవర్తించింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు డంబెల్‌తో కొట్టి చంపారు. ఆపై తనను కూడా చంపాలని పెద్ద కుమార్తె అలేఖ్య కోరింది. చెల్లి చనిపోయాక ఏమాత్రం భయపడకుండా తాను కూడా మరణించేందుకు సిద్ధమైంది. తాను కూడా చనిపోయి చెల్లెలిని బతికించి తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెప్పింది.

కుక్కకు పునర్జన్మ ప్రయోగం

ఆమె అంతకుముందే ఇంట్లోని పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు చేసినట్టు గుర్తించారు. కుక్కను చంపి మళ్లీ బతికించానని తల్లిదండ్రులను కూడా నమ్మించింది. దాంతో వాళ్లు ఏమీ సందేహించకుండా అలేఖ్య మాటలు విన్నారు. చిన్న కుమార్తెపై పునర్జన్మ ప్రయోగం చేసి చంపేశారు. ఇక, పూజల సందర్భంగా అలేఖ్య అరగుండు చేసుకుంది. నోటిలో రాగిచెంబు పెట్టుకుని పూజగదిలో కూర్చుంది. అదే రోజు సాయంత్రం ఐదింటికి ఆమెను కూడా తల్లిదండ్రులు డంబెల్‌తో కొట్టి చంపారు. ఓవరాల్‌గా పునర్జన్మలపై విశ్వాసమే వారిని ఈ హత్యలకు పురిగొల్పిందని రిపోర్టులో పేర్కొన్నారు.