Viral Video: నెక్ట్స్ జనరేషన్‌ను తయారు చేస్తున్నట్లే ఉన్నడుగా… భోజ్‌పురి పాట ‘రాజాజీ కే దిల్వా’ డ్యాన్స్‌లో కిలి పాల్‌తో కలిసి యువకులు..
సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు.. కిలి పాల్. ఈ టాంజానియా ఇంటర్నెట్ సెలబ్రిటీకి పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్ ప్రముఖుల దాకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతని ఇన్‌స్టా రీల్స్‌కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఎంతో మంది భారతీయుల మనుసులు దోచేశారు. కిలి పాల్...

సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు.. కిలి పాల్. ఈ టాంజానియా ఇంటర్నెట్ సెలబ్రిటీకి పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్ ప్రముఖుల దాకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతని ఇన్‌స్టా రీల్స్‌కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఎంతో మంది భారతీయుల మనుసులు దోచేశారు. కిలి పాల్ తరచుగా భారతీయ సంగీతం పట్ల తనకున్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరుస్తాడు. ఇటీవలి వీడియోలో, అతను ఒంటరిగా కాకుండా ‘రాజాజీ కే దిల్వా’ అనే భోజ్‌పురి పాటకు స్టెప్పులేశాడు. ఆస్వాదించాడు. అతని సోదరి నీమా కొన్ని నృత్య కదలికల కోసం అతనితో కలిసి కాలు కదిపింది. కొంతమంది పిల్లలతో కలిసి చేసిన డ్యాన్స్ ఇంటర్‌నెట్‌లో సంచలనంగా మారింది. వారు పూర్తి శక్తితో, సరదాగా కొన్ని క్లాసిక్ డ్యాన్స్ స్టెప్స్ వేశారు.
వీడియోలో తొలుత కిలి ఒక చిన్న పిల్లవాడి పక్కన నిలబడి ఉన్నాడు. ఆ పక్కన మరికొంత మంది పిల్లలు కూడా ఉన్నారు. అతను దేశీ బీట్‌కు లిప్-సింక్ చేస్తూ తన పిల్లలకు గ్రూవీ స్టెప్‌లను నేర్పించడానికి ప్రయత్నించాడు. అందులో చిన్నపిల్లవాడు కిలి స్టెప్స్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడం నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లతో పాట కిలి కూడా డ్యాన్స్ స్టెప్స్ వేశాడు.
ఓ బాలుడు కిలితో డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారిద్దరి వెను ఆసక్తికర పరిణామం జరిగింది. ఇంటి పైకప్పు కింద నిలబడి ఉన్న ముగ్గురు పిల్లలు భోజ్‌పురి పాటకు స్టెప్పులేసేందుకు కిలితో జతకలిశారు. పాట ప్లే అవుతుండగా, నృత్యకారుల బృందం దానికి స్వరం వినిపించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఉల్లాసంగా ఉన్న ఆ బృందం తమ స్వంత, నిష్కపటమైన కదలికలతో తమ పూర్తి టాలెంట్‌ను ప్రదర్శించారు.
వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కిలి యువ స్నేహితులను కూడా చూశామని నెటిజన్స్ పోస్టులు పెడుతన్నారు. కిలి తన గ్రామంలోని తరువాతి తరాన్ని వైరల్‌గా మార్చడానికి శిక్షణ ఇస్తున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. “బ్రదర్ తన తదుపరి రత్నాన్ని సిద్ధం చేస్తున్నాడు” అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్ 19న ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటికే ఆరు మిలియన్ల మందికి పైగా వీక్షించారు.
వీడియో చూడండి:
View this post on Instagram
