Man Lost Rs 14 Lakh: పెళ్లి చేసుకుని సమాజసేవ చేద్దామంటూ.. ముహర్తం పెట్టించి.. 14 లక్షలు కొట్టేసిన కిలాడీ లేడీ..
ఆన్ లైన్ లో స్నేహం, ప్రేమ, పరిచయం ఇలాంటి వద్దని.. ఆన్ లైన్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు.. మరోవైపు ఆన్ లైన్ లో చెప్పే మాటలు.. వినిపించే కథలు నమ్మి...
Man Lost Rs 14 Lakh: ఆన్ లైన్ లో స్నేహం, ప్రేమ, పరిచయం ఇలాంటి వద్దని.. ఆన్ లైన్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు.. మరోవైపు ఆన్ లైన్ లో చెప్పే మాటలు.. వినిపించే కథలు నమ్మి.. లక్షలకు లక్షలు ఇచ్చి మోసపోతూనే ఉన్నారు. తాజా ఘరానా మోసం ఒకటి ఇటీవలే బయటపడింది. ఆరు నెలలుగా ఓ యువకుడికి మాయమాటలు చెబతూ ఏకంగా 14 లక్షల రూపాయలను దోచుకుంది ఓ మాయలేడి పెళ్లి చేసుకుందాం అని చెప్పి ముహర్తం కూడా పెట్టించింది. రెండు రోజుల్లో పెళ్లి అనగా సెల్ ఫోన్ ను స్విచాఫ్ చేసింది.. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని పద్మారావు నగర్ కు చెందిన అర్జున్ అనే యువకుడికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.. చిన్న చిన్న వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడి కి గత ఏడాది ఏప్రిల్ లో వర్ణన మల్లిఖార్జున్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి ఒకరి ఫోన్ నెంబర్ ను ఒకరు తీసుకున్నారు.. వాట్సాప్ లో రోజూ చాట్ చేసుకునేవారు..తనకు అమ్మానాన్న లేరని.. తన తమ్ముడిని తనను అక్క చదివించిందని చెప్పింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.
పెళ్ళికి అర్జున్ రెడి అవ్వగానే కిలాడీ లేడీ అసలు రంగు బయటపెట్టింది. యువకుడి వద్ద నుంచి లాప్ టాప్, బంగారం హారం, కరోనా కి ఆస్పటల్ బిల్లు ఇలా అనేక కారణాలు చూపించి దాదాపు రూ. 6లక్షల వరకూ వసులు చేసింది. నవంబర్ లో పెళ్లి చేసుకుందామని వర్ణణ చెప్పడంతో అర్జున్ పెళ్లి ముహూర్తం కూడా పెట్టించి ఆమెకు డేట్ చెప్పాడు. ఈ క్రమంలోనే పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలని అడగడతో 25 రోజుల వ్యవధిలోనే రూ. 8లక్షల డబ్బు, బంగారు ఉంగరం, పంపించాడు. అయితే, పెళ్ళికి రెండు రోజుల సమయం ఉందనగా, యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆకిలాడీ లేడీ కోసం పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read: కరోనా ఎఫెక్ట్ తో సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్ ఆలస్యం.. ఓటీటీ వైపు చూస్తున్న నిర్మాత