పార్లమెంట్ క్యాంటీన్ లో ఇక మార్కెట్ రేట్లకే ఫుడ్, సబ్సిడీకి మంగళం, త్వరలో అమలు

పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు, ఇతరులకు తక్కువ రేట్లకు ఫుడ్, డిషెస్ ఇచ్ఛే  సంప్రదాయానికి స్వస్తి పలకనున్నారు. ఇప్పటివరకు ఈ క్యాంటీన్..

పార్లమెంట్ క్యాంటీన్ లో ఇక మార్కెట్ రేట్లకే ఫుడ్, సబ్సిడీకి మంగళం, త్వరలో అమలు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2021 | 11:27 AM

పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు, ఇతరులకు తక్కువ రేట్లకు ఫుడ్, డిషెస్ ఇచ్ఛే  సంప్రదాయానికి స్వస్తి పలకనున్నారు. ఇప్పటివరకు ఈ క్యాంటీన్ లో హైదరాబాదీ మటన్ బిర్యానీ 65 రూపాయలకు, బాయిల్డ్ వెజిటబుల్స్ 12 రూపాయలకు.. ఇలా అతి తక్కువ రేట్లకు అమ్ముతూ వచ్చారు. కానీ ఇకపై చాలా ఐటమ్స్ ని మార్కెట్ రేట్లకు అందివ్వనున్నారు. ఒక రోటీ 3 రూపాయలకు, శాకాహార భోజనం 100 రూపాయలు, నాన్ వెజ్ లంచ్ బఫె 700 రూపాయలకు లభ్యం కానునున్నాయి . మటన్ బిర్యానీ 150 రూపాయలైతే బ్రిటిష్ బాయిల్డ్ వెజిటబుల్స్ 50 రూపాయలకు దొరుకుతుంది.

2016 నుంచి పార్లమెంట్ క్యాంటీన్ లో ఫుడ్ ఐటమ్స్ రేట్లను పెంచాలని చాలా ప్రతిపాదనలు రెడీ చేశారు. సబ్సిడీకి స్వస్తి చెప్పాలని యోచించారు. కానీ అవన్నీ ఊహాగానాలే అయ్యాయి. ఈ క్యాంటీన్ లో అమ్మే ఫుడ్ ఐటమ్స్ ధరలు  పెరుగుతాయని  గతవారం స్పీకర్ ఓం బిర్లా  ప్రకటించారు. ఇలా సబ్సిడీ ఎత్తివేయడం వల్ల సాలీనా రూ. 8 కోట్లు ఆదా అవుతాయని లోక్ సభ సెక్రటేరియట్ అంచనా వేసింది. ఈ క్యాంటీన్ ని  ఇకపై నార్తర్న్ రైల్వేస్ బదులు ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లేదా ఐటీడీసీ   నిర్వహించనున్నాయి. ఇక్కడ  సబ్సిడీతో కూడిన ఫుడ్ ఐటమ్స్ ని సప్లయ్ చేయడం వల్ల ఏడాదికి సుమారు 13 కోట్లు ఖర్చు అవుతుందట.

లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..