AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత వేగంగా వెళ్లొచ్చు.. కొత్తగా మరో లైన్…

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఉపయోగపడేలా రైల్వేశాఖ మరో నిర్ణయం తీసుకుంది. త్వరలో మరో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. భూసేకరణకు కూడా లైన్ క్లియర్ అయింది. దీని వల్ల తిరుపతికి ప్రయాణ సమయం తగ్గనుంది.

Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు తీపికబురు.. మరింత వేగంగా వెళ్లొచ్చు.. కొత్తగా మరో లైన్...
Tirumala
Venkatrao Lella
|

Updated on: Aug 26, 2026 | 5:36 PM

Share

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. కొత్త రైల్వే లైన్ మంజూరు చేయగా.. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్‌ నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ చేపట్టాలని గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. దానిని తగ్గించేందుకు మూడో రైల్వే లైన్ నిర్మించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో ఇప్పుడు అధికారికంగా గెజిట్ విడుదల చేసింది.

రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

గెజిట్ విడుదల చేయడంతో భూసేకరణ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. గూడురు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది. మరింత వేగంగా తిరుపతికి ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల భక్తులకు సమయం ఆదా అవుతుంది. అలాగే తిరుపతితో పాటు చెన్నై, విజయవాడ, బెంగళూరు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు కూడా సమయం తగ్గుతుంది. రైళ్ల రాకపోకల్లో వేగం పెరగడంతో పాటు సరుకు రవాణా కూడా మెరుగవుతుంది. దక్షిణ భారతదేశంలోనే గూడూరు-రేణిగుంట మార్గం చాలా కీలకంగా ఉంది. దీంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని గుర్తించిన రైల్వేశాఖ.. ఈ మార్గంలో మూడో రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టింది. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఏపీలో మరో రైల్వే లైన్

ఇక ఏపీకి కేంద్రం మరో రైల్వే లైన్ ప్రకటించింది. గూడూరు నుంచి తమిళనాడులోని గుమ్మిడిపూండి వరకు3,4 రైల్వే లైన్లు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం దాదాపు రూ.2229 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. మొత్తం 90 కిలోమీటర్ల పొడవునా ఇది ఉంటుంది. ఏపీలో ఈ రైల్వే లైన్ 78.84 కిలోమీటర్ల పొడవునా ఉండనుండగా.. తమిళనాడులో 11.12 కిలోమీటర్లు ఉంటుంది. 2030-31 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతం గూడూరు నుంచి చెన్నైకు రెండు రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి తలపెట్టారు. ఇది అందుబాటులోకి వస్తే గూడూరు-చెన్నై మధ్య అరగంట ప్రయాణ సమయం తగ్గుతుంది. అలాగే రోజుకు 200 రైళ్ల వరకు రాకపోకలు కొనసాగించే సామర్థ్యం ఉంటుంది. దీని వల్ల చెన్నై వెళ్లేవారు వేగంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

Follow Us