Prabhas : ప్రభాస్‌కు విపరీతంగా కోపం తెప్పించే ఆ ఏకైక వ్యక్తి ఎవరు.. ? అసలు విషయం చెప్పిన జక్కన్న..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా డార్లింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా డార్లింగ్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు డైరెక్టర్ రాజమౌళి. సాధారణంగా ఎప్పుడూ ప్రశాంతంగా కూల్ గా కనిపించే ప్రభాస్ కు కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరనే విషయాన్ని వెల్లడించారు.

ప్యాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఆయన శాంతస్వభావం , డార్లింగ్ అని పిలిచే మైండ్ సెట్. రీల్ లైఫ్‌లో ఎంతటి భారీ యాక్షన్ సీన్స్ చేసినా, రియల్ లైఫ్‌లో మాత్రం ఆయన ఎంతో కూల్ అండ్ జ్యోవియల్‌గా ఉంటారు. అలాంటి ప్రభాస్‌కు కూడా విపరీతంగా కోపం వస్తుందా? షూటింగ్ సెట్స్‌లో ఆయనను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసే ఆ ఏకైక వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక టాక్ షోలో సమాధానమిస్తూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. జక్కన్న తెలిపిన వివరాల ప్రకారం, షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్‌కు విపరీతంగా కోపం తెప్పించే వ్యక్తి మరెవరో కాదు.. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్. ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ వంటి దృశ్య కావ్యాలను తెరకెక్కించడంలో సెంథిల్ కుమార్ వహించిన పాత్ర అపారమైనది. అయితే, రాజమౌళి కంటే కూడా సెంథిల్ కుమార్ తీవ్రమైన పెర్ఫెక్షనిస్ట్ అని జక్కన్న చెప్పారు. పనుల్లో సెంథిల్ అనుకున్నది పక్కాగా వచ్చేవరకు ఎవరినీ వదిలిపెట్టరు.
ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..
సాధారణంగా అవుట్‌డోర్ షూటింగ్‌లలో ఎండ, మేఘాల వల్ల లైటింగ్ మారినప్పుడు లైటింగ్ మీటర్ ఉపయోగించి మళ్ళీ చెక్ చేయడం సహజం. కానీ, సెంథిల్ కుమార్ ఇండోర్ సెట్స్‌లో లేదా స్టూడియో లైటింగ్ సెటప్‌లలో కూడా ఏమాత్రం కాంతి మారదని తెలిసినప్పటికీ.. పదే పదే చెకింగ్స్ చేస్తారట. అసిస్టెంట్లతో లైట్ సెటప్‌ను పదిసార్లు పక్కాగా చెక్ చేయించడమే కాకుండా, ఆయనకు నమ్మకం కుదరక స్వయంగా వెళ్లి మళ్లీ చెక్ చేస్తారట.
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..
షాట్ రెడీ అయిపోయిందని అనుకుని నటులు సిద్ధంగా ఉన్న సమయానికి సెంథిల్ మళ్ళీ రీ-చెకింగ్ అని సమయం తీసుకోవడంతో ప్రభాస్‌కు తీవ్రమైన కోపం వచ్చేదని రాజమౌళి సరదాగా ఇమిటేట్ చేస్తూ వెల్లడించారు. తన ఫ్రెండ్లీ నేచర్‌తో అందరినీ అలరించే డార్లింగ్ ప్రభాస్‌ను సహనం కోల్పోయేలా చేసేది సెంథిల్ పర్ఫెక్షన్ మాత్రమేనని రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం జక్కన్న వారణాసి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..
ఎక్కువమంది చదివినవి : మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..
