Tirumala: అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..
తిరుమలలో చిరుత కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం దగ్గర గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శిలాతోరణం దగ్గర ఉన్న కొండపై రాజసం ఒలకబోస్తూ కూర్చున్న చిరుత ఫోటో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తిరుమలలో వన్యప్రాణులు జనావాసాలకు సమీపంగా వస్తుండటం కలకలం రేపుతోంది.. చిరుతలు, ఏలుగుంబ్లు, పాములు.. ఇలా చాలా జంతువులు జనావాసాలకు సమీపంగా వస్తుంటాయి.. తాజాగా.. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది.. శిలాతోరణం దగ్గర చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో, వెంటనే టీటీడీ, టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని.. ఒంటరిగా వెళ్లొద్దని.. చిరుత కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
సర్వదర్శనం క్యూలైన్ సమీపంలోనే చిరుత కనిపించడంతో భక్తులు వణికిపోయారు.. కాగా.. శిలాతోరణం దగ్గర ఉన్న కొండపై రాజసం ఒలకబోస్తూ కూర్చున్న చిరుత ఫోటో, వీడియో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.
వీడియో చూడండి..
సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో.. అధికారులు.. సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతను మరింత పెంచారు..
గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని పొట్టనపెడ్డుకుంది చిరుత. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అంతేకాకుండా.. పలువురు భక్తులపై కూడా దాడి చేసిన సందర్భాలున్నాయి.. అంతకుముందు జరిగిన సంఘటనల దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..