Tirupati Kidnap Case: నాలుగు నెలల వేటకు ఫలితం దక్కింది.. నాడు తప్పించుకున్నాడు.. నేడు అడ్డంగా దొరికిపోయాడు..

Tirupati Kidnap Case: ఇతని మొఖం చూస్తే.. కోళ్లను కాదు కదా.. పిల్లులను ఎత్తుకెళ్లే వాడిలా ఉన్నాడు. ఇతన్ని గుర్తు పట్టారా? గతంలో

Tirupati Kidnap Case: నాలుగు నెలల వేటకు ఫలితం దక్కింది.. నాడు తప్పించుకున్నాడు.. నేడు అడ్డంగా దొరికిపోయాడు..
Kidnaper
Follow us

|

Updated on: Jul 07, 2021 | 2:26 PM

Tirupati Kidnap Case: ఇతని మొఖం చూస్తే.. కోళ్లను కాదు కదా.. పిల్లులను ఎత్తుకెళ్లే వాడిలా ఉన్నాడు. ఇతన్ని గుర్తు పట్టారా? గతంలో ఎప్పుడైనా ఇతని ఫోటో చూసినట్టుగా మీకు గుర్తుందా? కొద్దిగా ప్లాష్‌బ్యాక్‌కు వెళ్లండి. ఎక్కువ కాలం అవసరం లేదు. జస్ట్‌.. నాలుగు నెలలు మాత్రమే. ఇతనే దొంగ.. ఇతనే కిడ్నాపర్‌.. ఎవరైనా చూస్తే.. మాకు గానీ, పోలీసులకు గానీ చెప్పండి అంటూ.. టీవీ9 ప్రచారమే కాదు.. ప్రత్యేక క్యాంపెయిన్‌ కూడా నిర్వహించింది. ఎంతలా అంటే.. ఎక్కడ ఏమూలకు ఉన్నా నిందితుడిని పట్టుకునేంతలా!.. ఆ ప్రయత్నమే ఇప్పుడు ఫలించింది. ఎక్కడో.. ఎవరో చూసి ఈ కన్నింగ్‌ గాడి గురించిన సమాచారం పోలీసులకు అందించారు. అంతే.. అతని స్థావరానికి చేరుకున్న పోలీసులు.. పట్టేశారు.

శివ ప్రసాద్‌ అలియాస్‌ శివారెడ్డి. పిల్లలను ఎత్తుకెళ్లే దొంగ. నాలుగు నెలల క్రితం తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని ఎత్తుకెళ్లింది ఇతనే. ఇంత కాలం ఎవరికి తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా కర్నాటకలో దాక్కుడున్నారు. అయితే, ఎవరో.. ఎక్కడో టీవీ9 ప్రసారం చేసిన కథనాన్ని చూసి.. వారు రహస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు వెళ్లిన పోలీసులకు.. ఆనాడు శివం సాహుని కిడ్నాప్‌ చేసిన శివారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతిలోని అలిపిరిలో 4 నెలల క్రితం కిడ్నాప్‌కు గురైన చత్తీస్‌ఘడ్‌ బాలుడి కిడ్నాప్‌ కేసులో నిందితుడుని పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. నాలుగు నెలల క్రితం సాహు ఫ్యామిలీ స్వామి వారి దర్శనానికి వచ్చింది. తిరుపతి బాలాజీ లింక్ బస్ స్టాండ్ వద్ద ఫ్యామిలీ నిద్రించింది. అప్పటికే పక్కా స్కెచ్‌ వేసిన శివారెడ్డి.. చడీచప్పుడు కాకుండా నిద్రలో ఉన్న సాహుని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. టీవీ9 కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున కథనాలను ప్రసారం చేసింది. ప్రత్యేక ప్రోమోలతో ప్రచారం చేసింది. నిందితుడి ఫోటోలతో స్టోరీలను నడిపించింది. అప్పటి నుంచి శివారెడ్డి తప్పించుకునే తిరుగుతున్నాడు. ఎట్టకేలకు.. సాహూని కిడ్నాప్‌ చేసింది శివారెడ్డి అని పోలీసులు తేల్చారు. అయితే.. ఈ బాలుడి కిడ్నాప్‌పై ఇతగాడు కొత్త కథనం చెప్పుకొస్తున్నాడు.

కర్నాటక ముల్బాగల్‌ తాలూకా పుట్టనహళ్లికి చెందిన శివారెడ్డికి ఓ కొడుకు ఉన్నాడు. అనారోగ్యంతో ఆ కొడుకు చనిపోయాడు. ఎవరిని చూసినా తన కొడుకులా ఊహించుకునే శివారెడ్డి.. శివం సాహుని కూడా తన కొడుకులాగే భావించాడు. ఈ నేపథ్యంలోనే ఎత్తుకెళ్లి పెంచుకుందామని అనుకున్నట్లు పోలీసుల ముందు స్టోరీ చెప్పాడు. ఈ వాదనలు విన్న పోలీసులే షాక్‌ తిన్నారు. ఏది ఏమైనా 15 ప్రత్యేక బృందాల నాలుగు నెలల గాలింపు ఫలితంగా ఎట్టకేలకు నిందితుడు దొరికిపోయాడు. తిరుపతి అర్బన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Terror Links: మరోసారి ఉలిక్కి పడ్డ నిజామాబాద్ జిల్లా.. సౌదీలో ఐసిస్‌తో సంబంధాలు.. బోధన్‌లో వ్యక్తి అరెస్ట్..

Auto-Rickshaw Race: చెన్నై రోడ్లపై ఆటో రేస్.. హడలిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..

Boy Missing: అడవిలో తప్పిపోయిన బాలుడు.. 8వ రోజూ దొరకని ఆచూకీ.. డాగ్ స్క్వాడ్ సైతం..