AP Housing Scheme: ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వ గుర్తు ఉంటే తప్పేంటి?.. ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి సూటి ప్రశ్న..

AP Housing Scheme: ఇళ్ల నిర్మాణ పథకంలో తమ ప్రభుత్వ భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వ గుర్తు వినియోగించుకోవడంలో

AP Housing Scheme: ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వ గుర్తు ఉంటే తప్పేంటి?.. ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి సూటి ప్రశ్న..
Minister Ranganath
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 07, 2021 | 11:32 AM

AP Housing Scheme: ఇళ్ల నిర్మాణ పథకంలో తమ ప్రభుత్వ భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వ గుర్తు వినియోగించుకోవడంలో తప్పేముందని ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాధరాజు ప్రశ్నించారు. బుధవారం నాడు మంత్రి రంగనాధ రాజు తిరముల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ పథకం కేంద్ర ప్రభుత్వానిదైనా, రాష్ట్ర ప్రభుత్వానిదైనా కార్యక్రమం నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చేది రూ.1.50 లక్షలు మాత్రమే అని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం.. పేదలకు రూ.10 లక్షలు విలువజేసే భూమి కేటాయించి రూ.3.50 లక్షలు నిర్మాణానికి అందిస్తున్నామని చెప్పారు. మొత్తంగా రూ.13.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఖర్చు చేస్తున్నామనీ, ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ గుర్తుతో పాటూ కేంద్ర ప్రభుత్వ గుర్తు కూడా వేస్తామని చెప్పారు.

దేశంలో నిర్మించే ప్రతి నాలుగు ఇళ్లలో ఒక ఇళ్లు ఆంధ్రప్రదేశ్‌లో కడుతున్నామంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే అని పేర్కొన్నారు మంత్రి రంగనాధ రాజు. అంతేకాదు.. ఇళ్ల నిర్మాణం కోసం 30వేల ఎకరాల ప్రైవేట్ భూమిని కూడా సేకరించి మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. సీఎం జగన్ మహా సంకల్పంతో రాష్ట్రంలోని మహిళలను ఆస్తిపరులను చేయడానికి పూనుకున్నారని అన్నారు. సంపద సృష్టించడానికి రూ.1.10 లక్షల కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. మూడు రోజులపాటు శంకుస్థాపన మహోత్సవాలు ప్రారంభించి 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయించామని మంత్రి రంగనాధ రాజు తెలిపారు.

Also read:

Tirupati Kidnap Case: నాలుగు నెలల వేట ఫలితం దక్కింది.. నాడు తప్పించుకున్నాడు.. నేడు అడ్డంగా దొరికిపోయాడు..

Terror Links: మరోసారి ఉలిక్కి పడ్డ నిజామాబాద్ జిల్లా.. సౌదీలో ఐసిస్‌తో సంబంధాలు.. బోధన్‌లో వ్యక్తి అరెస్ట్..

Auto-Rickshaw Race: చెన్నై రోడ్లపై ఆటో రేస్.. హడలిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..