AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లోపే ఆగిన తండ్రి గుండె..!

తిరుపతి జిల్లాలో పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తిలోని కేవీబీ పురం మండలం కోవనూరుకు చెందిన సాంబయ్య ఇంట్లో జరగాల్సిన పెండ్లి విషాదంగా ముగిసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సాంబయ్యకు భార్య ఇద్దరు ఆడ బిడ్డలు. పెద్ద కూతురుకు ఇటీవల తమ దగ్గర బంధవుతో వివాహం నిశ్చయమైంది.

కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లోపే ఆగిన తండ్రి గుండె..!
Bride
Raju M P R
| Edited By: |

Updated on: Jun 06, 2025 | 4:40 PM

Share

తిరుపతి జిల్లాలో పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తిలోని కేవీబీ పురం మండలం కోవనూరుకు చెందిన సాంబయ్య ఇంట్లో జరగాల్సిన పెండ్లి విషాదంగా ముగిసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సాంబయ్యకు భార్య ఇద్దరు ఆడ బిడ్డలుండగా పెద్ద కూతురుకు మూగ, వినికిడి సమస్యతో బాధపడుతోంది.

మాట, వినికిడి లోపం ఉన్న కూతుర్ని అల్లారుముద్దుగా చూసుకున్న సాంబయ్య దంపతులు పెళ్లి చేసి సంబరం చూడాలనుకున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కు చెందిన సమీప బంధువుల ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. దగ్గరి బంధుత్వమున్న కుటుంబంలోని యువకుడికి కూతురిని ఇచ్చి ఘనంగా పెళ్లి ముచ్చట జరిపించాలని భావించారు. ఇందులో భాగంగానే కొన్ని రోజులు పాటు సెలవు పెట్టి పెళ్లి పనులు చూసుకుంటున్న సాంబయ్య శ్రీకాళహస్తి సమీపంలోని అంజూరు కళ్యాణ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు.

అన్ని పనులు దగ్గరుండి కానీ చూసుకున్న సాంబయ్య గురువారం(జూన్ 05) సాయంత్రం శ్రీకాళహస్తి నుంచి పెండ్లికి కావాల్సిన వస్తువులు, సామాన్లు కళ్యాణ మండపానికి చేర్చే ప్రయత్నం చేశాడు. పెళ్లి మండపం వద్ద బంధువుల హడావుడి కొనసాగుతుండగా, పెళ్లి సామాగ్రిని శ్రీకాళహస్తి నుంచి ఆటోలో పంపి వెనుక బైక్ లో బయలుదేరాడు. సాంబయ్య కొద్ది దూరం వెళ్లక ఉన్నపళంగా బైక్ నుంచి కింద వాలిపోయాడు. అక్కడే కుప్పకూలి పడిపోయాడు.

బైక్ పై మండపానికి వెళుతూ గుండె పోటుకు గురైన సాంబయ్య గుర్తించిన స్థానికులు హుటాహుటిన శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సాంబయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సాంబయ్య కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లేపే విషాద ఘటన జరిగి పోయింది. దీంతో రాత్రి జరగాల్సిన కూతురు రిసెప్షన్ ఆగిపోగా కళ్యాణ మండపం మూగబోయింది. తండ్రి సాంబయ్య మృతితో అర్ధాంతరంగా కూతురు పెళ్లి ఆగిపోయింది.

సాంబయ్య సొంతూరు కోవనూరులోని పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సాంబయ్య డెడ్ బాడీని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటల్లో పెళ్లి పీటలపై కూర్చోనున్న కూతురి పెళ్లి వేడుక చూడకుండానే తండ్రి సాంబయ్య కన్నుమూయడంతో పెళ్లిలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు స్నేహితులు గుండెలు బాదుకుంటూ విలపించడం అందరినీ కలిచివేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు