AP Rains: అలెర్ట్.! ఏపీలోని ఆ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.. పూర్తి వివరాలు..
ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోంది. విండ్ డిస్ కంటిన్యూటీ కారణంగా.. ఏపీలో వాతావరణం చల్లబడింది. బుధవారం ఉత్తరకొస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. మరి వాతావరణ శాఖ ఇచ్చిన వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..
ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోంది. విండ్ డిస్ కంటిన్యూటీ కారణంగా.. ఏపీలో వాతావరణం చల్లబడింది. బుధవారం ఉత్తరకొస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దక్షిణ కోస్తాలోను తేలిక పాటి వర్షం కురుస్తుంది. కోస్తా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. చెట్లు, పోల్స్ కింద ప్రజలు ఉండరాదని, పొలాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని నిపుణుల సూచిస్తున్నారు. పాడేరు ఏజెన్సీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం తెల్లవారుజాము నుంచి కురుస్తోంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చాలా వరకు, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని.. చెట్లు, టవర్స్, పోల్స్ కింద ఉండరాదన్నారు. పొలాలు, మైదానాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా.. సురక్షితమైన ప్రదేశాలను ఆశ్రయించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది.
ఇది చదవండి: కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. ఈ జిల్లాలకు.!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..