తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. అవి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలు. ఇక రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది..జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో ఉండగా..మిగిలిన జిల్లాలకు గ్రీన్ అలర్ట్ ఉంది. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే పలుచోట్ల వర్షం పడుతోంది..దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. ఆకాశం మేఘావృతమైంది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.