AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆ ప్రాంతాన్ని నాగుపాములు పగబట్టాయా.!! బాబోయ్.. కుప్పలు కుప్పలుగా

విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. బుసలు కొడుతూ భయపెడుతున్నాయి. ఇళ్లల్లో, వాకిట్లో, వాష్ రూమ్‌లో ఒకటని కాదు.. ఎక్కడ చూసినా పాములే పాములు..! కొన్ని గంటల వ్యవధిలోనే మూడు పాములు ఒకే ప్రాంతంలో దర్శనమివ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.

AP News: ఆ ప్రాంతాన్ని నాగుపాములు పగబట్టాయా.!! బాబోయ్.. కుప్పలు కుప్పలుగా
Ap News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 11, 2024 | 5:02 PM

Share

విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. బుసలు కొడుతూ భయపెడుతున్నాయి. ఇళ్లల్లో, వాకిట్లో, వాష్ రూమ్‌లో ఒకటని కాదు.. ఎక్కడ చూసినా పాములే పాములు..! కొన్ని గంటల వ్యవధిలోనే మూడు పాములు ఒకే ప్రాంతంలో దర్శనమివ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పాములు పగ పట్టాయా అన్నట్టుగా భయపెడుతున్నాయి విషసర్పాలు. అవి కూడా నాగుపాములే కావడంతో.. ఇక అక్కడ ఆందోళన మరింత పెరిగింది. ఇంతకీ ఎక్కడ ఆ ప్రాంతం..?

అల్లూరి ఏజెన్సీ అనగానే.. టక్కున గుర్తుకు వచ్చేవి అరకు, పాడేరు..! అరకు పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది.. జిల్లా హెడ్ క్వార్టర్‌గా ఉంది పాడేరు. ఇప్పుడు ఆ పాడేరులో పాములు కనిపించే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో.. అప్పుడప్పుడు పాములు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఎగిరే పాము రంగురంగుల్లో కనిపిస్తూ భయపెట్టింది. కానీ ఇప్పుడు.. నాగుపాములు భయపెడుతున్నాయి. అది కూడా గంటల వ్యవధిలోనే పాములు దర్శనమిస్తుండటం ఆందోళన మరింత పెంచుతుంది.

వారి ఆందోళనకు కారణం అదే..!

నిజంగా నాగుపాములు పాడేరకు పగ పట్టాయా అన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. వారి ఆందోళనకు తగ్గట్టుగానే.. గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో మూడు వేరు వేరు చోట్ల మూడు నాగుపాములు కనిపించాయి. లోచలిపుట్టు, గుడివాడ కాలనీ, రేకుల కాలనీలో నాగుపాములు హడలెత్తించాయి.

ఇవి కూడా చదవండి

వరుసగా నాగుపాములు..!

రెండు రోజుల క్రితం చాకలిపేటలోని ఉపాధ్యాయుడు ఇంట్లో ఎగిరే పాము రంగురంగుల్లో కనిపించింది. దీంతో అంతా ఆందోళన చెందారు.. చూసేందుకు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అరుదైన వింత పాము కనిపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. దాన్ని చాకచకంగా పట్టుకుని స్నేక్ క్యాచర్ సహాయంతో అడవుల్లో విడిచిపెట్టారు. ఆ భయం నుంచి తెరకోకముందే.. మళ్లీ లోచలీపుట్టులో నాకు బొమ్మ బుసలు కొట్టింది. కనకమహాలక్ష్మి అనే మహిళ ఇంట్లో వాష్ రూమ్ లో నాగు పాము కనిపించింది. భారీ నాగుపామును చూసి హడాలెత్తి పోయారు కుటుంబ సభ్యులు. స్నేక్ కేచారకు సమాచారం అందించారు. దాన్ని రెస్క్యూజ్ చేసిన కొంత సమయానికే గుడివాడ కాలనీలో మరో ఇంట్లో నాగుపాము దర్శనమిచ్చింది. శివాజీ అనే కుటుంబం నివాసం ఉంటున్న ఇంటిమట్ల వద్ద బారీ నాగుపాము కనిపించింది. దాన్ని కూడా రెస్క్యూ చేశారు. ఆ పక్కనే ఉన్న రేకుల కాలనీలో మనోహర్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో మరో నాగుపాము కనిపించింది. ఆదమరిస్తే కాటేసేలా ఉంది. గంటల వ్యవధిలోనే మూడు వేరువేరు చోట్ల మూడు నాగుపాములను చాకచక్యంగా బంధించాడు స్నేక్ కేచర్ వాసు.

అందుకే అలా వచ్చేస్తున్నాయా..?!

అయితే.. వరుసగా నాగుపాములు పాడేరు కాలనీలోకి వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. నాగుపాములు ఏమైనా పగబట్టాయా అన్న ఆందోళనతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే అక్కడ పరిస్థితులు ఉండడంతో హడలెత్తిపోతున్నారు స్థానిక జనం. కొందరైతే పాముకు దండాలు పెట్టి మళ్ళీ రావద్దమ్మా అంటూ వేడుకుంటున్నారు. అయితే.. ఇటీవల పాడేరు ఏజెన్సీలో భారీగా వర్షాలు కురిసాయి. ఆ తర్వాత ఎండలు కాస్తున్నాయి. చల్లదనం కోసం పాములు జనావాసంలోకి వచ్చేస్తున్నట్టు మరికొందరు అంటున్నారు. కాగా.. అటవీ ప్రాంతంలో కట్టడాలు వెలుస్తుండడం… పాముల ఆవాసాలు ధ్వంసం అవడంతో జనావాసాల పైకి పడుతున్నట్టు మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా.. వరుస ఘటనలతో ఉలిక్కిపడిన పాడేరు వాసులకు.. ఈ పాముల బెడదల నుంచి మోక్షం కలిగేది ఎప్పుడో..?!

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..